T20 World Cup: వేదిక మారినా హక్కులు మావే!

30 Apr, 2021 14:59 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహణపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. గతేడాది ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన ఈ మెగా ఈవెంట్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ సంవత్సరం ద్వితీయార్థం(అక్టోబర్‌- నవంబరు)లో టోర్నీ నిర్వహణకై బీసీసీఐ హక్కులు సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ రోజువారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదు కావడం, కరోనా మరణాలు కూడా పెరుగుతుండటంతో వేదికగా మార్చే దిశగా సమాలోచనలు జరుపుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌, టీ20 ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌ డైరెక్టర్‌ ధీరజ్‌ మల్హోత్రా స్పందించారు. ‘‘వరల్డ్‌ కప్‌ గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుందేమో. కానీ, ఒకవేళ దేశంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే యూఏఈలో నిర్వహించే అంశం గురించి ఆలోచిస్తున్నాం. అయితే, హక్కులు మాత్రం బీసీసీఐవే’’ అని స్పష్టం చేశారు. కాగా అనేక సవాళ్లను అధిగమించి బయో బబుల్‌ నిబంధనల నడుమ బీసీసీఐ ఐపీఎల్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేకుండానే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ కొనసాగుతోంది. 

చదవండి: పృథ్వీ షా మెడపట్టి నొక్కి.. శివం మావి స్వీట్‌ రివేంజ్‌!

మరిన్ని వార్తలు