భారత్‌ కాకుంటే లంక, యూఏఈల్లో... 

14 Aug, 2020 01:54 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌కు ప్రత్యామ్నాయ వేదికలు 

దుబాయ్‌: వచ్చే ఏడాది భారత్‌లో టి20 ప్రపంచ కప్‌ (పురుషులు) జరగాల్సివుంది. అయితే ప్రతికూల పరిస్థితుల వల్ల కుదరకపోతే  శ్రీలంక లేదంటే యూఏఈల్లో నిర్వహించేలా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రత్యామ్నాయ వేదికల్ని ఖరారు చేసింది. నిజానికి ప్రపంచ కప్‌ లాంటి మెగా టోర్నీలకు ప్రత్యామ్నాయ వేదికలను ప్రకటించడం సర్వసాధారణం. ఇది ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. ప్రస్తుత కరోనా మహమ్మారి వల్ల ప్రతిపాదించిన కొత్త అంశమేమీ కాదు.

అయితే భారత్‌లో కరోనా ఉధృతి నానాటికీ పెరిగిపోతోంది. ఇప్పటికే 23 లక్షల (2.3 మిలియన్లు) పైచిలుకు కేసులతో టాప్‌–3లో ఉంది. దీంతో వచ్చే ఏడాదికల్లా కరోనా నియంత్రణలోకి రాకపోతే మెగా ఈవెంట్‌ పరిస్థితి ఏంటని సగటు క్రికెట్‌ అభిమానికి తలేత్తే ప్రశ్న! ఇప్పుడు ఐసీసీ నిర్ణయంతో ఈ ప్రశ్నకు జవాబు దొరికినట్లయింది. ఇప్పటికే ఈ ఏడాది భారత్‌లో సాధ్యంకానీ ఐపీఎల్‌ 13వ సీజన్‌ను యూఏఈలో నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహమ్మారి వల్ల ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 మెగాఈవెంట్‌ 2022కు వాయిదా పడింది. 

మరిన్ని వార్తలు