Common Wealth Games: కామన్‌వెల్త్‌ బెర్తు కోసం కోర్టుకెక్కిన టీటీ ప్లేయర్లు

17 Jun, 2022 07:59 IST|Sakshi

న్యూఢిల్లీ: టేబుల్‌ టెన్నిస్‌లో మరో క్రీడాకారిణి కామన్వెల్త్‌ గేమ్స్‌ బెర్తు కోసం కోర్టుకెక్కింది. డబుల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ అయిన అర్చన కామత్‌ తనను జాతీయ జట్టు నుంచి తప్పించడంపై కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. టేబుల్‌ టెన్నిస్‌ జట్టు ఎంపిక విషయమై కోర్టుకెక్కిన నాలుగో ప్లేయర్‌ అర్చన. గతంలో దియా, మానుశ్‌ షా, స్వస్తిక ఘోష్‌లు కూడా కోర్టు తలుపు తట్టారు.

ప్రస్తుతం భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) వ్యవహారాలను పరిపాలక మండలి (సీఓఏ) పర్యవేక్షిస్తోంది. తొలుత టీటీఎఫ్‌ఐ సెలక్టర్లు అర్చనను ఎంపిక చేశారు. కానీ ఆమె ఇటీవలి ప్రదర్శన బాగోలేదంటూ బర్మింగ్‌హామ్‌ ఈవెంట్‌ నుంచి ఉన్నపళంగా తప్పించారు.  

చదవండి: 'నన్ను కొట్టేవాడు.. మరో మహిళా సైక్లిస్టుతో సంబంధం అంటగట్టి'.. మాజీ సైక్లింగ్‌ కోచ్‌ మెడకు బిగుస్తున్న ఉచ్చు

మరిన్ని వార్తలు