తైవాన్‌ ఎక్సలెన్స్‌ గేమింగ్‌ కప్‌లో భారత్‌ నుంచి 8 వేల మంది..

30 Sep, 2021 16:04 IST|Sakshi

తైపీ: విభిన్న రకాల ఆన్‌లైన్‌ గేమ్స్‌లో పోటీపడేందుకు రూ.10లక్షల దాకా ప్రైజ్‌ మనీని పొందేందుకు అవకాశం అందించే ఆన్‌లైన్‌ ఆటల సందడి మొదలైంది. అత్యధిక సంఖ్యలో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రియుల ఆదరణ పొందిన తైవాన్‌ ఎక్స్‌లెన్స్‌ గేమింగ్‌ కప్‌ (టిఇజిసి) క్వాలిఫైర్స్‌ 2వ రౌండ్‌ అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టిఇజిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ తైవాన్‌ ఎక్స్‌లెన్స్‌ మార్క్‌ వ్యూ తెలిపారు.  

గత 16వ తేదీన ప్రారంభమైన ఈ గేమింగ్‌ సందడి డిసెంబరు 5తో ముగుస్తుందనీ, ఈ స్పోర్ట్స్‌ ప్రియులు అత్యధిక సంఖ్యలో ఈసారి భారత్‌ నుంచి పాల్గొన్నారని వివరించారు. ఈ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి 8వేల మందిపైగా నమోదు చేసుకున్నారన్నారు. ఈ ఏడాది పలు ప్రాచుర్యం పొందిన కొత్త గేమ్స్‌ తాము పరిచయం చేశామని, అత్యాధునిక గేమింగ్‌ టెక్నాలజీని అందిస్తున్నామని తెలిపారు. 

చదవండి: తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్‌, కోహ్లి
 

>
మరిన్ని వార్తలు