Taliban-Afghanistan Cricket Team: తాలిబన్ల పాలనలో అఫ్గన్‌ తొలి క్రికెట్‌ సిరీస్‌ ఇదే!, ఎక్కడంటే..

5 Sep, 2021 10:06 IST|Sakshi

ఢాకా: అఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే ముస్లిం షరియత్‌ చట్టాల ప్రకారం పాలన కూడా సాగిస్తున్నారు. ఈ క్రమంలో అఫ్గన్‌ క్రికెట్‌ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది. అయితే, అఫ్గన్‌ క్రికెట్‌ విషయాల్లో తల దూర్చబోమంటూ తాలిబన్లు ఇటీవల స్పష్టమైన హామీనిచ్చిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో అఫ్గన్‌ గడ్డపై తాలిబన్ల పాలన మొదలయ్యాక తొలిసారిగా ఆ దేశ అండర్ -19 జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనకు వెళ్లింది. సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య సిల్హెట్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌ అండర్ -19 జట్టుతో ఐదు వన్డేలు, నాలుగు రోజుల మ్యాచ్ ఆడనునుంది.

మొదటి విడతగా ఎనిమిది మంది ఆటగాళ్ల బృందం ఢాకా కు చేరుకుంది. మిగిలిన ఆటగాళ్లు మరో రెండు విడతలుగా అక్కడకు చేరుకుంటారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి రబీద్ ఇమామ్ తాజాగా వెల్లడించారు. అఫ్ఘన్ ఆటగాళ్లు  ఢాకా వచ్చిన వెంటనే సిల్హెట్‌కు వెళ్లిపోయారని ఇమామ్ చెప్పారు. 2020, ఫిబ్రవరిలో అండర్‌-19 క్రికెట్‌ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత బంగ్లా అండర్‌ 19 టీమ్‌కు ఇదే తొలి సిరీస్‌ కావడం విశేషం.

చదవండిSouth africa vs Sri lanka: రెండో వన్డేలో  దక్షిణాఫ్రికా గెలుపు

మరిన్ని వార్తలు