Tata Steel Chess: రన్నరప్‌ ఎరిగైసి అర్జున్‌

22 Nov, 2021 05:06 IST|Sakshi

టాటా స్టీల్‌ ఇండియా బ్లిట్జ్‌ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌కు రెండో స్థానం

కోల్‌కతా: భారత యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణ ప్లేయర్‌ ఎరిగైసి అర్జున్‌ టాటా స్టీల్‌ ఇండియా బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌కు చెందిన 18 ఏళ్ల అర్జున్‌... ప్రపంచ మాజీ బ్లిట్జ్‌ చాంపియన్‌ లెవాన్‌ అరోనియన్‌ (అర్మేనియా) 11.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.

అయితే ఒంటరి విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య రెండు గేమ్‌ల టైబ్రేక్‌ను నిర్వహించారు. ఈ రెండు గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగిశాయి. దాంతో అర్మగెడాన్‌ గేమ్‌ను నిర్వహించారు. అర్మగెడాన్‌ గేమ్‌లో అరోనియన్‌ 38 ఎత్తుల్లో అర్జున్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. అర్జున్‌ రన్నరప్‌ ట్రోఫీతో సంతృప్తి చెందాడు. ఇదే టోర్నీలో ర్యాపిడ్‌ విభాగంలో అర్జున్‌ విజేతగా నిలి చిన సంగతి తెలిసిందే. బ్లిట్జ్‌ టోర్నీ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక నాలుగు పాయింట్లు సాధించి చివరి స్థానంలో నిలిచింది.

మరిన్ని వార్తలు