Table Tennis Championship: టేబుల్‌ టెన్నిస్‌ సెమీఫైనల్లో తెలంగాణ 

21 Sep, 2022 13:40 IST|Sakshi

గుజరాత్‌లో జరుగుతున్న జాతీయ క్రీడల్లో టేబుల్‌ టెన్నిస్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. ఆకుల శ్రీజ, నిఖత్‌ బాను, వరుణి జైస్వాల్‌ సభ్యులుగా ఉన్న తెలంగాణ గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. హరియాణా, గుజరాత్‌ జట్లపై 3–1తో నెగ్గిన తెలంగాణ 0–3తో మహారాష్ట్ర చేతిలో ఓడింది. జాతీయ క్రీడలు ఈనెల 29 నుంచి జరగనున్నాయి. అయితే అవే తేదీల్లో భారత జట్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాల్సి ఉండటంతో టీటీ ఈవెంట్‌ను ముందుగా నిర్వహిస్తున్నారు.    

మరిన్ని వార్తలు