అరరే.. హార్దిక్‌ వన్డే సెంచరీ మిస్‌

27 Nov, 2020 17:18 IST|Sakshi

సిడ్నీ: వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మిస్‌ చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో  76 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు సాయంతో  హార్దిక్‌ 90 పరుగులు చేసి ఔటయ్యాడు. సెంచరీకి చేరువగా వచ్చి హార్దిక్‌ ఔట్‌ కావడంతో టీమిండియా అభిమానులు నిరాశ చెందారు. అంతకుముందు వన్డేల్లో హార్దిక్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు 83. ఇప్పుడు ఆ స్కోరును హార్దిక్‌ అధిగమించినా శతకాన్ని మాత్రం నమోదు చేయలేకపోయాడు. ఆసీస్‌ నిర్దేశించిన 375 పరుగుల ఛేదనలో భాగంగా 101 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో హార్దిక్‌ పాండ్యా తన సహజ సిద్ధమైన శైలిలో దూకుడుగా ఆడాడు.

టీ20 ఫార్మాట్‌ తరహాలో రెచ్చిపోయి 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బౌలర్‌ ఎవరనే విషయాన్ని పక్కన పెట్టిన హార్దిక్‌ బ్యాట్‌ను ఝుళిపించాడు. హార్దిక్‌ పాండ్యా దూకుడుగా ఆడి జట్టు స్కోరును గాడిలో పెట్టాడు. మ్యాక్స్‌వెల్‌ బౌలింగ్‌ సిక్స్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ సాధించాడు పాండ్యా,. భారీ స్కోరు కావడంతో బంతుల్ని వృథా చేయకుండా రన్‌రేట్‌ను కాపాడుతూ బ్యాట్‌కు పని చెప్పాడు. కాగా, ఆ తర్వాత హార్దిక్‌ కాస్త మెల్లగానే ఆడాడు. సాధ్యమైనంత వరకూ క్రీజ్‌లో ఉండాలనే ఉద్దేశంతో హార్దిక్‌ తన స్టైల్‌ ఆటను పక్కకు పెట్టాడు. కానీ కీలక సమయంలో వికెట్‌ ఇవ్వడంతో టీమిండియా మరొకసారి కష్టాల్లో పడింది. జంపా వేసిన 39 ఓవర్‌ ఐదో బంతికి స్టార్క్‌కు క్యాచ్‌ ఇచ్చి హార్దిక్‌ ఔటయ్యాడు. దాంతో టీమిండియా 247 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది.(అరోన్‌ ఫించ్‌ బ్యాటింగ్‌ రికార్డు)

మరిన్ని వార్తలు