IND Vs AUS: విశాఖ చేరుకున్న క్రికెటర్లు; వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన

18 Mar, 2023 18:22 IST|Sakshi

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం(మార్చి 19న) విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా అదే జోష్‌తో రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంది.  ఇప్పటికే టీమిండియా, ఆసీస్‌ క్రికెటర్లు విశాఖకు చేరుకున్నారు. ఆటగాళ్లందరిని విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌కు తరలించారు. మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. మ్యాచ్‌ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడయ్యాయి. 

వర్షం నేపథ్యంలో అభిమానుల్లో ఆందోళన
అయితే మ్యాచ్‌ సంగతి పక్కనబెడితే ఒక విషయమై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఉపరితల ద్రోని ప్రభావంతో విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా రేపు మ్యాచ్‌ జరుగుతుందా లేదా అన్నది అనుమానంగా మారింది. నేటి ఉదయం నుంచే విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. వచ్చే 24 గంటల పాటు వర్షం కురిసే చాన్స్‌ ఉందని వాతావరణ విభాగం తెలిపింది.

ప్రస్తుతం విశాఖలోని క్రికెట్‌ స్టేడియంను సిబ్బంది పూర్తి కవర్లతో కప్పి ఉంచారు. అయితే ఎంత భారీ వర్షం పడినా స్టేడియంలో ఉన్న ఆధునాతన డ్రైనేజీ వ్యవస్థ వల్ల మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని విశాఖ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. అయితే రోజంతా వర్షం పడే అవకాశం ఉండడంతో మ్యాచ్‌ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారత్‌, ఆసీస్‌ వన్డే మ్యాచ్‌ సందర్భంగా విశాఖ సిటీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. విశాఖ సిటీ నుంచి క్రికెట్ స్టేడియం కి వెళ్ళే వీఐ పి, వివిఐపి పాస్ వాహనాలకు బి స్టేడియంతో పాటు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద  పార్కింగ్ కేటాయించారు.
విశాఖ నుంచి వచ్చే వాహనాలకు సాంకేతిక కాలేజీ వద్ద పార్కింగ్ సదుపాయం
ఆన్ లైన్ లో  టికెట్లు మార్చుకునేందుకు సాంకేతిక కాలేజీ వద్ద కౌంటర్ ఏర్పాటు
ఆనంద పురం నుంచి వచ్చేవారి కోసం సాంకేతిక కాలేజీ వద్ద..ఎం.వి.వి సిటీ వద్ద పార్కింగ్ సౌకర్యం
మ్యాచ్‌ సందర్భంగా ఆదివారం విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్ లు..గూడ్స్ వాహనాలు హనుమంత వాక..అడవి వరం మీదుగా మళ్లించనున్నారు.
విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్ళే కార్లు, టూ వీలర్లను హనుమంత వాక  నుంచి విశాలాక్షి నగర్ , బీచ్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు
శ్రీకాకుళం నుంచి వచ్చే బస్ లు మారిక వలస నుంచి బీచ్ రోడ్డు మీదుగా  తెన్నేటి పార్క్...విశాలాక్షి నగర్ మీదుగా నగరంలోకి అనుమతి
శ్రీకాకుళం  నుంచి అనకాపల్లి అటు ఇటు వెళ్లే భారీ వాహనాలు ఆనంద పురం..పెందుర్తి  వైపుగా మళ్లింపు

చదవండి: చరిత్రలో నిలిచిపోయే రనౌట్‌..

అమ్మమ్మ ఇలాకాలో రోహిత్ మెరిసేనా?.. సిరీస్‌ విజయంపై గురి

మరిన్ని వార్తలు