ఏడాది కాలంలో 9 ఓపెనింగ్‌ జోడీలను మార్చిన టీమిండియా

30 Jul, 2022 18:14 IST|Sakshi

ఇటీవలి కాలంలో టీమిండియా పొట్టి ఫార్మట్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నా ఓ విషయం మాత్రం అభిమానులను పెద్ద ఎత్తున కలవరపెడుతుంది. సిరీస్‌కు ఓ కెప్టెన్‌ మారుతుండటంతో ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న సగటు టీమిండియా అభిమానిని.. కొత్తగా ఓపెనింగ్‌ సమస్య జట్టు పీక్కునేలా చేస్తుంది. ఏడాది కాలంలో టీమిండియా ఏకంగా తొమ్మిది ఓపెనింగ్‌ జోడీలను మార్చడమే అభిమాని ఈ స్థితికి కారణంగా మారింది.

తాజాగా విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్‌ శర్మకు జతగా సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగడంతో అభిమానులు ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా హైలైట్‌ చేస్తున్నారు. అన్నీ సజావుగా సాగుతూ, జట్టు వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వైఖరిని తప్పుబడుతున్నారు.

ఓ జోడీకి కనీసం నాలుగైదు అవకాశాలైనా ఇవ్వకుండానే మార్చేయడం పద్దతి కాదని చురకలంటిస్తున్నారు. పేరుకు మాత్రమే రోహిత్‌-కేఎల్‌ రాహుల్‌ రెగ్యులర్‌ ఓపెనర్లని, వీరిద్దరిలో ఒకరు అందుబాటులో ఉంటే మరొకరు ఉండరన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏదైన కొత్త జోడీని తయారు చేయాల్సిందిపోయి, వరుస పెట్టి ఓపెనర్లను మార్చడం ఎంతమాత్రం సమంజసంకాదని అభిప్రాయపడుతున్నారు.

కొందరైతే రోహిత్‌కు జతగా శిఖర్‌ ధవన్‌ ఉండగా.. ఈ ప్రయోగాలెందుకు దండగ అంటూ అని అంటున్నారు. ఎలాగూ ధవన్‌ ఇటీవలి కాలంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు కాబట్టి రోహిత్‌కు జతగా అతన్ని పర్మనెంట్‌గా ఆడించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ డిస్కషన్‌ హాట్‌ హాట్‌గా సాగుతుంది. 

12 నెలల కాలంలో టీమిండియా మార్చిన ఓపెనింగ్‌ జోడీలు.. 

1. రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్, 
2. కేఎల్ రాహుల్-ఇషాన్ కిషన్
3. రోహిత్ శర్మ-ఇషాన్ కిషన్
4. రుతురాజ్ గైక్వాడ్-ఇషాన్ కిషన్
5. సంజు శాంసన్-రోహిత్ శర్మ
6. దీపక్ హుడా-ఇషాన్ కిషన్
7. ఇషాన్‌ కిషన్‌-సంజు శాంసన్‌
8. రోహిత్ శర్మ-రిషభ్ పంత్
9. రోహిత్‌ శర్మ-సూర్యకుమార్ యాదవ్
చదవండి: Ind Vs WI: నిజంగా వాళ్లిద్దరు గ్రేట్‌! ప్రపంచకప్‌ జట్టులో మనిద్దరం ఉండాలి!

మరిన్ని వార్తలు