గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న టీమిండియా క్రికెటర్

30 Sep, 2021 20:29 IST|Sakshi

Hanuma Vihari Takes Part In Green India Challenge: టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి పాల్గొన్నాడు. ఛాలెంజ్‌లో భాగంగా హైద‌రాబాద్‌లోని త‌న నివాస‌ంలో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా విహారి మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్క‌లు నాట‌డం సంతోషంగా ఉంద‌న్నాడు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ప్ర‌తి ఒక్క‌రూ పాటుప‌డాలని పిలుపునిచ్చాడు. కార్యక్రమంలో భాగంగా టీమిండియా క్రికెటర్‌, హైదరాబాదీ పేసర్‌ మహ్మద్ సిరాజ్, టీమిండియా దిగ్గజ క్రికెటర్‌, ద వాల్‌ రాహుల్ ద్రవిడ్, కృష్ణ ప్రియలకు ఆయన ఛాలెంజ్ విసిరాడు.
చదవండి: గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్‌ ప్రకటన
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు