ICC Test Championship 2021-23: అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా

7 Sep, 2021 13:40 IST|Sakshi

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో ఓవల్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ 2021-23 టేబుల్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి చూసుకుంటే భారత్‌ రెండు విజయాలు.. ఒక ఓటమి.. ఒక డ్రాతో మొత్తంగా 54.17 శాతం పర్సంటైల్‌తో 26 పాయింట్లు సాధించింది. ఇక రెండో స్థానంలో పాకిస్తాన్‌ ఉంది. పాక్‌ జట్టు విండీస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. ఓవరాల్‌గా ఒక గెలుపు, ఒక ఓటమితో 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా.. వెస్టిండీస్‌ 50 శాతం పర్సంటైల్‌తో 12 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.

చదవండి: Virat Kohli Winning Words: ఇలాంటి విజయం ఊహించలేదు.. మా కుర్రాళ్లు అద్భుతం

ఇక పాయింట్ల పరంగా ఇంగ్లండ్‌ విండీస్‌, పాక్‌ల కంటే ఎక్కవగా ఉన్నప్పటికీ.. టీమిండియాతో సిరీస్‌లో రెండు ఓటములు ఉండడంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా ఒక గెలుపు, రెండు ఓటములు, ఒక డ్రాతో 29.17 శాతం పర్సంటైల్‌తో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక నాలుగో టెస్టులో 157 పరుగులతో అద్భుత విజయంతో 50 ఏళ్ల తర్వాత ఓవల్‌ మైదానంలో విజయాన్ని అందుకుంది. 1971లో అజిత్‌ వాడేకర్‌ నాయకత్వంలో విజయాన్ని అందుకున్న టీమిండియా.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కోహ్లి నాయకత్వంలో ఓవల్‌ మైదానంలో విజయాన్ని సాధించింది. ఇక చివరిదైన ఐదో టెస్టు సెప్టెంబర్‌ 10 నుంచి మాంచెస్టర్‌ వేదికగా జరగనుంది.

చదవవండి: Rohit Vs Shardul : అసలు హీరో శార్దూల్‌ ఠాకూర్‌.. నాకంటే అతనే అర్హుడు


ఫోటో క్రెడిట్‌: ఐసీసీ

మరిన్ని వార్తలు