బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు..

15 Mar, 2021 15:40 IST|Sakshi

గోవా: టీమిండియా స్పీడ్‌గన్‌ జస్ప్రీత్ బుమ్రా నేడు(మార్చి 15) ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్‌‌ను గోవాలో పెళ్లాడాడు. ఈ వివాహానికి అతికొద్దిమంది సన్నిహితులు, బంధువుల మాత్రమే ఆహ్వానం లభించింది. వేడుకకు హాజరయ్యే అతిధులు మొబైల్ ఫోన్స్‌‌ కూడా తీసుకురావొద్దని కాబోయే వధూవరులు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో కేవలం 20 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం లభించింది. వివాహానికి ముందు జరిగే సంగీత్‌ తదితర కార్యక్రమాలు ఆదివారమే పూర్తయినట్లు వధూవరుల సన్నిహితులు పేర్కొన్నారు. 

టీమిండియా పేస్‌ దళానికి నాయకత్వం వహిస్తున్న 27 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా.. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న సిరీస్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అతను సిరీస్‌ నుంచి వైదొలగడానికి వివాహమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు అతను పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేనప్పటికీ.. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకు జరుగబోయే ఐపీఎల్ 2021 సీజన్‌కు మాత్రం సంసిద్ధంగా ఉంటాడని ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా, ముంబై ఇండియన్స్ గతేడాది టైటిల్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు