2021లో బిజీ బిజీగా...

21 Nov, 2020 05:07 IST|Sakshi

పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడనున్న భారత క్రికెట్‌ జట్టు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది భారత క్రికెట్‌ జట్టు ఆడాల్సిన పలు సిరీస్‌లు రద్దయ్యాయి. ఐపీఎల్‌ విజయవంతంగా జరిగినా... టీమిండియాకు మాత్రం ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. కోవిడ్‌–19 ప్రభావం మొదలైన తర్వాత కోహ్లి సేన ఇప్పటి వరకు ఇంకా బరిలోకి దిగలేదు. ఈ నెలలో ఆస్ట్రేలియాతో సిరీస్‌తో మన ఆటగాళ్లు మళ్లీ మైదానంలో కనిపించనున్నారు.

ఈ లోటును తీరుస్తూ వచ్చే ఏడాది ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ పెద్ద సంఖ్యలో సిరీస్‌లకు సన్నద్ధమవుతోంది. 2021లో భారత జట్టు ఐపీఎల్‌ సహా కనీసం 9 సిరీస్‌లు/టోర్నీలలో ఆడే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 14 టెస్టులు, 13 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లలో భారత్‌ పాల్గొనవచ్చని సమాచారం. ఇంగ్లండ్‌ పర్యటనలో భారత్‌ ఆడే వన్డేల సంఖ్య, ఆసియా కప్‌ టి20 టోర్నీలో, ప్రపంచకప్‌ టి20 టోర్నీలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల సంఖ్య ఇంకా ఖరారు కాలేదు.

  సరిగ్గా చెప్పాలంటే ఏడాదిలో ఏ ఒక్క నెలలోనూ విరామం లేకుండా మన క్రికెట్‌ కొనసాగనుంది. ‘పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటం క్రికెటర్లకు అంత సులువు కాదనే విషయం మాకూ తెలుసు. అయితే ఎఫ్‌టీపీ ఒప్పందాలను మేం గౌరవించాల్సిందే. ఇప్పుడు మన జట్టులో ప్రతిభకు కొదవ లేదు. ఒకరు కాదంటే మరొకరు అన్నట్లుగా పెద్ద సంఖ్యలో యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. రొటేషన్‌ విధానంలో వారికి అవకాశాలు లభించవచ్చు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. భారత్‌ ఆడబోయే సిరీస్‌ల వివరాలను చూస్తే...


 

మరిన్ని వార్తలు