ఆ అమ్మాయిని చూసి పారిపోయాను: కోహ్లి

19 May, 2021 13:56 IST|Sakshi

వైరలవుతోన్న టీమిండియా కెప్టెన్‌ కోహ్లి పాత వీడియో

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఎంటీవీ వీజే అనూశ దండేకర్‌ ఓ ప్రైవేల్‌ పార్టీలో యుక్త వయసులో ఉన్న కోహ్లిని ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇది. దీనిలో అనూశ ర్యాపిడ్‌ ఫైర్‌ ఫార్మట్‌లో యంగ్‌ కోహ్లిని కొన్ని ప్రశ్నలు అడిగింది. వాటిలో ‘‘మీ జీవితంలో త్వరగా ముగిసిన భోజనం, స్నానం, డేట్‌’’ గురించి ప్రశ్నించింది. దానికి బదులుగా కోహ్లి ఒకమ్మాయితో బ్లైండ్‌ డేట్‌కి వెళ్లానని.. కానీ ఆమె అందంగా లేకపోవడంతో ఐదు నిమిషాల్లో అ‍క్కడి నుంచి పారిపోయాను అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. 

దీనిలో కోహ్లి మాట్లాడుతూ.. ‘‘ఒకసారి బ్లైండ్‌ డేట్‌కి వెళ్లాను.. కానీ అది కేవలం ఐదు నిమిషాల్లో ముగిసింది. ఆ అమ్మాయి అంత అందంగా లేదు. తనను చూడగానే అక్కడ నుంచి వెళ్లిపోయాను’’ అని కెమరా వైపు చూసి.. ‘‘సారీ.. కానీ ఆ అమ్మాయి అంత అందంగా లేదు’’ అని తెలిపాడు. ఇక ఈ ఇంటర్వ్యలూ కోహ్లి బాలీవుడ్‌ హీరోయిన్‌ల గురించి కూడా మాట్లాడాడు. అయితే అనుష్క గురించి కాదు. ‘‘ఏ హీరోయిన్‌ క్రికెట్‌ ఆడాలనుకుంటే మీరు చూడాలనుకుంటున్నారు’’ అనే ప్రశ్నకు కోహ్లి జెనిలియా అని సమాధానం చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. 

చదవండి: అది ఇంకా బాధించేది: విరాట్‌ కోహ్లి

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు