IND vs ZIM: ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్‌!

18 Aug, 2022 17:25 IST|Sakshi

ఆరు నెలల తర్వాత జట్టులోకి వచ్చిన భారత పేసర్‌ దీపక్‌ చాహర్‌ అదరగొట్టాడు. హరారే వేదికగా  జింబాబ్వే జరుగుతోన్న తొలి వన్డేలో చాహర్‌ నిప్పులు చేరిగాడు. ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు బౌలింగ్‌ చేసిన చహర్‌ మూడు కీలక వికెట్లు పడగొట్టి 27 పరుగులు ఇచ్చాడు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వేను ఆదిలోనే ఓపెనర్లు కియా, మారుమణి పెవిలియన్‌కు పంపి చాహర్‌ కోలుకోలేని దెబ్బకొట్టాడు. అనంతరం వన్‌డౌన్‌ బ్యాటర్‌ మాధేవేరేను కూడా ఔట్‌ చేసి చాహర్‌ మూడో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా చాహర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయపడ్డాడు. దీంతో అతడు ఐపీఎల్‌తో పాటు పలు సిరీస్‌లకు కూడా దూరమయ్యాడు. అనంతరం గాయం నుంచి కోలుకున్న చాహర్‌ జింబాబ్వే సిరీస్‌తో పునరాగామనం చేశాడు. అదే విధంగా ఆసియా కప్‌-2022కు స్టాండ్‌బైగా చహర్‌ ఎంపికయ్యాడు. ఇక తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే భారత బౌలర్లు చేలరేగడంతో 189 పరుగులకే కుప్పకూలింది.

టీమిండియా బౌలర్లలో చహర్‌, ప్రసిధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌ ఒక్క వికెట్‌ తీశాడు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో టెయిలండర్‌లు రిచర్డ్‌ నగరవా(34), బ్రాడ్‌ ఎవన్స్‌(33)  అద్భుతమైన ఆటతీరుతో అకట్టుకున్నారు.


చదవండిZIM vs IND: టీమిండియాపై జింబాబ్వే టెయిలండర్‌ల కొత్త చరిత్ర !

మరిన్ని వార్తలు