69 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన రోహిత్‌-రాహుల్‌

12 Aug, 2021 20:55 IST|Sakshi

లండన్‌: టీమిండియా టెస్టు ఓపెనింగ్‌ జోడి రోహిత్‌ శర్మ-కేఎల్‌ రాహుల్‌లు నయా రికార్డు లిఖించారు. ఇంగ్లండ్‌తో ఇక్కడ లార్డ్స్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఈ జోడి 126 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఫలితంగా 69 ఏళ్ల తర్వాత లార్డ్స్‌ మైదానంలో టెస్టు మ్యాచ్‌లో వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన టీమిండియా ఓపెనింగ్‌ జోడిగా నిలిచింది. 

1952లో లార్డ్స్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారిగా వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత వారి సరసన రోహిత్‌-రాహుల్‌ల జోడి చేరింది. రోహిత్‌-రాహుల్‌లు 106 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత వినోద్‌-పంకజ్‌ల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశారు.  

కాగా, ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ 83 పరుగులు చేసి ఔటయ్యాడు.  145 బంతుల్లో 11 ఫోర్లు,  1 సిక్స్‌ సాయంతో 83 పరుగులు చేసిన రోహిత్‌.. అండర్సన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. దాంతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక లార్డ్స్‌లో టాస్‌ గెలిచిన జట్టు ప్రత్యర్థిని ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించిన తర్వాత అత్యధిక ఓపెనింగ్‌ రికార్డు కూడా రోహిత్‌-రాహుల్‌లు సాధించారు.  ఓవరాల్‌గా ఇంగ్లండ్‌లో ఒక విజిటింగ్‌ టీమ్‌ టాస్‌ కోల్పోయిన తర్వాత అత్యధిక పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాల్లో రోహిత్‌-రాహల్‌లు నెలకొల్పింది రెండో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యంగా నిలిచింది. ఇంగ్లండ్‌తో తాజా మ్యాచ్‌లో 52 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పుజారా(9) నిరాశపరచగా, రాహుల్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 

మరిన్ని వార్తలు