ఎల్బీ స్టేడియం ముందు కోచ్‌ల మెరుపు ధర్నా

3 Apr, 2021 12:51 IST|Sakshi

సాక్షి, నాంపల్లి: హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం ముందు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్‌లు శనివారం మెరుపు ధర్నాకు దిగారు. 27 ఏళ్లుగా ఒప్పంద కోచ్ లగా పని చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ శాట్స్ కోచ్ లు నిరసనకు దిగారు. రెగులరైజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలని ఎన్ని సార్లు వేడుకున్నఎలాంటి స్పందన రాకపోవడంతోనే మెరుపు ధర్నాకు దిగినట్లు తెలిపారు. తెలంగాణ వచ్చాక అయిన తమ బతుకులు బాగుపడతాయి అనుకుంటే... సీన్ రివర్స్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తమకు జీతాలు కూడా టైమ్ కి ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్ నేత రవి శంకర్ మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ కోచ్ లను క్రమబద్ధీకరించాలి. సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని కోచ్‌లు ఆవేదన చెందుతున్నారు.  క్రీడలు ఎంతో పవిత్రమైనది.. ఈ రంగంలో మేము 1993 నుంచి సేవలు అందిస్తున్నాం.. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి.. ఈ విషయంలో ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావిస్తున్నాం. మేము ఎవరిని విమర్శించటం లేదు.కోచింగ్ వల్ల సమాజం లో క్యారెక్టర్ అభివృద్ధి అవుతుంది. ఇప్పటివరకు 30 జాతీయ మల్ల యోధులను తయారు చేశాం. మా చైర్మన్ వెంకట్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలి. అని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు