అజేయంగా కీర్తిక 

8 Dec, 2023 04:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అండర్‌–13 చెస్‌ చాంపియన్‌షిప్‌ బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి బి.కీర్తిక ఐదో విజయం సాధించింది. గురువారం జరిగిన ఏడో రౌండ్‌ గేమ్‌లో కీర్తిక 44 ఎత్తుల్లో మీరా సింగ్‌ (ఢిల్లీ)పై గెలిచింది. ఏడో  రౌండ్‌ తర్వాత నిహిరా కౌల్‌ (మహారాష్ట్ర), ఆముక్త  (ఆంధ్రప్రదేశ్‌)లతో కలసి కీర్తిక ఆరు పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉంది.

కీర్తిక ఐదు గేముల్లో గెలిచి, రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి నైనా గొర్లి 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... శ్రేయా హిప్పరాగి (మహారాష్ట్ర) 7 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తెలంగాణకే చెందిన సంహిత పుంగవనం, శివాంశిక 5.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి ఉమ్మడిగా నాలుగో  స్థానంలో ఉన్నారు.    

>
మరిన్ని వార్తలు