Womens Asia Cup 2022: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన థాయ్‌లాండ్‌.. క్రికెట్‌ చరిత్రలో తొలి విజయం

6 Oct, 2022 12:54 IST|Sakshi

మహిళల ఆసియాకప్‌-2022లో పాకిస్తాన్‌ జట్టుకు థాయ్‌లాండ్ గట్టి షాక్‌ ఇచ్చింది. షెల్లాట్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్ 4 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తమ టీ20 క్రికెట్‌ చరిత్రలో పాకిస్తాన్‌పై థాయలాండ్‌కు ఇదే తొలి విజయం. 117 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ మరో బంతి మిగిలూండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

థాయ్‌ ఓపెనర్‌  నటకన్ చంతమ్ 61 పరుగులు చేసి.. తమ జట్టు చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్‌ బౌలర్లలో నిదా దార్‌, హసన్‌ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకుముందు థాయ్‌లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమైంది.

పాక్‌ బ్యాటర్లలో అమీన్‌ 56 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. ఇక థాయ్‌ బౌలర్లలో టిప్పోచ్ రెండు, తిపట్చా పుట్టావాంగ్ ఒక్క వికెట్‌ సాధించారు. ఇక పాకిస్తాన్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 7న భారత్‌ తలపడనుంది.


చదవండిIND VS SA: లక్నోలో భారీ వర్షం.. తొలి వన్డేపై నీలినీడలు

మరిన్ని వార్తలు