రవిశాస్త్రి.. నీకంటే తోపు ఎవడూ లేడు!

25 Apr, 2021 00:00 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రిపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ ప్రశంసలు కురిపించాడు. ఇప్పటివరకూ టీమిండియాకు కోచ్‌ల పరంగా చూస్తే రవిశాస్త్రి కంటే అత్యుత్తమ కోచ్‌ ఎవరూ తనకు కనిపించలేదంటూ గావస్కర్‌ ప్రశించాడు. ప్రత్యేకంగా యువ క్రికెటర్లలో రవిశాస్త్రి నింపుతున్న విశ్వాసం వెలకట్టలేనిదన్నాడు. ఇది తాను కూడా నమ్మలేకపోతున్నానన్నాడు.

భారత క్రికెట్‌ జట్టు ప్రారంభకాలంలో ఘనతలను తెలుపుతూ రూపొందించిన వెబినార్‌ ‘1971’ ఆవిష్కరణ కార్యక్రమంలో గావస్కర్‌.. రవిశాస్త్రిని ప్రత్యేకంగా కొనియాడాడు. ఇక భారత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ సూచనలు కూడా ఎంతగానో యువ బౌలర్లకు సహకరిస్తున్నాయన్నాడు. ఈరోజు మన భారత సీమ్‌ బౌలర్ల గురించి మాట్లాడుతున్నామంటే అది భరత్ అరుణ్‌ ఘనతేనన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన సెకాండాఫ్‌ మన బౌలింగ్‌ మరింత రాటుదేలడానికి కారణం అరుణ్‌ పర్యవేక్షణేనని గావస్కర్‌ తెలిపాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు