Thomas Cup 2022: కొత్త చరిత్ర సృష్టిస్తారా!

15 May, 2022 06:35 IST|Sakshi

నేడు థామస్‌ కప్‌ ఫైనల్‌

తొలి టైటిల్‌ వేటలో భారత్‌

బ్యాంకాక్‌: అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే ఆకట్టుకున్న భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు తొలి సారి థామస్‌ కప్‌ను అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. నేడు జరిగే ఫైనల్లో భారత బృందం 14 సార్లు చాంపియన్‌ అయిన ఇండోనేసియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో తొలిసారి సెమీస్‌ చేరడం ద్వారా గురువారం కనీసం కాంస్యం ఖాయం చేసుకున్న మన షట్లర్లు, శుక్రవారం మరో అడుగు ముందుకేసి సెమీస్‌లో కూడా విజయం సాధించారు. నాకౌట్‌ దశలో మలేసియా, డెన్మార్క్‌లను ఓడించి భారత్‌ తుది పోరుకు అర్హత సాధించగా...ఇండోనేసియా జట్టు చైనా, జపాన్‌ల ను ఓడించింది.

గత రికార్డుపరంగా చూస్తే ఇండోనేసియాకంటే భారత్‌ కాస్త బలహీనంగా కనిపిస్తున్నా... డెన్మార్క్‌తో సెమీస్‌ పోరులో మన ఆట కొత్త ఆశలు రేపుతోంది. పైగా రెండు అద్భుత విజయాలు అందించిన ప్రేరణ మన ప్లేయర్లలో ఉత్సాహం పెంచడం ఖాయం. సింగిల్స్‌లో ఇప్పటి కే శ్రీకాంత్, ప్రణయ్‌ తమ సత్తా చాటగా మరో సింగిల్స్‌ మ్యాచ్‌ మాత్రం మనకు కలిసి రావడం లేదు. ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత లక్ష్య సేన్‌ ఈ సారైనా చెలరేగితే జట్టు బెంగ తీరుతుంది. మూడు సింగిల్స్‌లో గెలిచే అవకాశాలు ఉంటే...రెండు డబుల్స్‌ మ్యాచ్‌లలో కనీసం ఒకటై నా గెలిచేందుకు అవకాశం ఉంటుంది. సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌శెట్టి తమ పాత్రను సమర్థంగా పోషించగలరు. గాయంతోనే సెమీస్‌లో ఆడిన ప్రణయ్‌ పూర్తి స్థాయిలో కోలుకోవాల్సి ఉంది.

మరిన్ని వార్తలు