Lionel Messi: మెస్సీని మెచ్చుకుంటూనే అవమానించాడు

10 Mar, 2023 09:22 IST|Sakshi

యూఈఎఫ్‌ఏ ఛాంపియన్స్‌ లీగ్‌లో మెస్సీ సారధ్యంలోని పీఎస్‌జీ కథ ముగిసింది. గురువారం తెల్లవారుజామున డిఫెండింగ్‌ ఛాంపియన్‌ బెయర్న్‌ మ్యునిచ్‌తో జరిగిన రౌండ్‌ ఆఫ్‌ 16 మ్యాచ్‌లో పీఎస్‌జీ 2-0 తేడాతో ఓటమి పాలై నాకౌట్‌ అయింది. బెయర్న్‌ మ్యునిచ్‌ తరపున ఎరిక్‌ మాక్సిమ్‌ మోటింగ్‌(61వ నిమిషం), సెర్గి గ్నార్బీ(89వ నిమిషం)లో గోల్స్‌ చేశారు.

కాగా బెయర్న్‌ మ్యునిచ్‌ యూఈఎఫ్‌ఏ లీగ్‌లో క్వార్టర్స్‌ చేయడం ఇది పదమూడోసారి కావడం విశేషం. కాగా 2020లో ఇదే బెయర్న్‌ మ్యునిజ్‌.. అప్పటి పీఎస్‌జీని ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం బెయర్న్‌ మ్యునిచ్‌ కెప్టెన్‌.. జర్మనీ స్టార్‌ ఫుట్‌బాలర్‌ థామస్‌ ముల్లర్‌ మెస్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెస్సీని ఒకవైపు మెచ్చుకుంటేనే మరోవైపు అవమానించాడు.

''మెస్సీ ఒక రియలిస్టిక్‌ ఆటగాడు.. మ్యాచ్‌ గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అర్జెంటీనా స్టార్‌గా అతను ఎన్నో ఘనతలు సాధించాడు. అతనంటే నాకు గౌరవం.. కానీ పారిస్‌ జెయింట్స్‌ లాంటి ఫుట్‌బాల్‌ క్లబ్స్‌ తరపున మాత్రం మెస్సీ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. క్లబ్స్‌లో తన రియలిస్టిక్‌ ఆటను చూడలేకపోతున్నాం. దేశం తరపున మాత్రమే మెస్సీ కెప్టెన్‌గా పనికొస్తాడు.. క్లబ్స్‌ తరపున కెప్టెన్‌గా పనికిరాడు. ఈ ఒక్క విషయంలో క్రిస్టియానో రొనాల్డోతో మెస్సీని పోల్చవచ్చని.. మెస్సీ లాగే రొనాల్డో కూడా ఇటీవలే కాలంలో కెప్టెన్‌గా విఫలమవుతున్నాడనే విషయం గుర్తుపెట్టుకోవాలి.'' అంటూ తెలిపాడు.

చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి

>
మరిన్ని వార్తలు