Tiger Woods: కన్నీటి పర్యంతమైన టైగర్‌వుడ్స్‌

16 Jul, 2022 18:28 IST|Sakshi

గోల్ఫ్‌ ఆటలో లెజెండరీ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అమెరికాకు చెందిన టైగర్‌వుడ్స్‌. వ్యక్తిగత జీవితంలో మాయని మచ్చలు చాలానే ఉన్నా.. ఆటలో మాత్రం పేరు, సంపదలు బాగానే చూశాడు. తాజాగా బ్రిటిష్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న టైగర్‌వుడ్స్‌ దాదాపు 18 హోల్స్‌ పూర్తి చేశాడు. ఆట ముగిసిన అనంతరం టైగర్‌వుడ్స్‌ కన్నీటి పర్యంతమయ్యాడు.

టైగర్‌వుడ్స్‌ వెళ్లిపోతున్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడంతో పాటు కరతాళధ్వనులు చేశారు. బహుశా వయసు రిత్యా మళ్లీ బ్రిటిష్‌ ఓపెన్‌ ఆడేందుకు చాన్స్‌ లేదనే కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడని భావిస్తున్నారు. ''గోల్ఫ్‌లో ఇన్నేళ్లుగా ఉన్న నాపై ఇంకా అభిమానం తగ్గనందుకు చాలా సంతోషంగా ఉందని.. 18 హోల్స్‌కు నాకిచ్చిన స్టాండింగ్‌ ఒవేషన్‌కు కృతజ్ఞత తెలుపుకుంటున్న.'' అంటూ పేర్కొన్నాడు. 

ఇక గోల్ప్‌లో 15 సార్లు మేజర్‌ టైటిల్స్‌ కొల్లగొట్టిన టైగర్‌వుడ్స్‌ నిజంగానే రారాజు అని అభివర్ణించొచ్చు. అయితే 46 ఏళ్ల టైగర్‌వుడ్స్‌ జీవితంలో గతేడాది జరిగిన కారు ప్రమాదం మాత్రం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. మానసికంగా చాలా కుంగిపోయిన టైగర్‌వుడ్స్‌ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మానసిక, ఆరోగ్య సమస్యలతో దాదాపు 17 నెలలు ఆటకు దూరమయ్యాడు. కాగా 2022 ఏప్రిల్‌లో ఆగస్టా నేషనల్‌ గోల్ఫ్‌ ద్వారా మళ్లీ అడుగుపెట్టాడు. రీఎంట్రీ ఘనంగా లేకున్నప్పటికి తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. మానసికంగా ఎంతో వేదన అనుభవించిన తర్వాత కూడా గోల్ఫ్‌లోకి తిరిగి రావాలన్న అతని సంకల్పాన్ని అందరూ మెచ్చుకున్నారు. 

చదవండి: Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్‌.. కెరీర్‌కు గుడ్‌బై

మరిన్ని వార్తలు