హైదరాబాద్‌ రంజీ జట్టు కెప్టెన్ గా తిలక్‌ వర్మ 

31 Dec, 2023 04:25 IST|Sakshi

దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో పాల్గొనే హైదరాబాద్‌ జట్టును ప్రకటించారు. భారత జట్టు సభ్యుడు ఠాకూర్‌ తిలక్‌ వర్మ హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ వైస్‌ కెప్టెన్ గా ఉంటాడు.

గత రంజీ ట్రోఫీ సీజన్‌లో ఎలైట్‌ డివిజన్‌లో పోటీపడ్డ హైదరాబాద్‌ తమ గ్రూప్‌లో చివరిస్థానంలో నిలవడంతో ఈసారి ‘ప్లేట్‌’ డివిజన్‌లో పోటీ పడనుంది. ‘ప్లేట్‌’ డివిజన్‌లో హైదరాబాద్‌తోపాటు సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌ జట్లున్నాయి. హైదరాబాద్‌ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 5 నుంచి నాగాలాండ్‌తో, రెండో మ్యాచ్‌ను జనవరి 12 నుంచి మేఘాలయతో ఆడుతుంది. 

హైదరాబాద్‌ రంజీ జట్టు: తిలక్‌ వర్మ (కెప్టెన్ ), రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ (వైస్‌ కెప్టెన్ ), తన్మయ్‌ అగర్వాల్, సీవీ మిలింద్, రోహిత్‌ రాయుడు, టి.రవితేజ, తనయ్‌ త్యాగరాజన్, చందన్‌ సహని, కార్తికేయ కక్, నితేశ్‌ కన్నల, సాయిప్రజ్ఞయ్‌ రెడ్డి, సాకేత్‌ సాయిరామ్, అభిరత్‌ రెడ్డి, సాగర్‌ చౌరాసియా, ఇ.సంకేత్‌.

స్టాండ్‌బైస్‌: రాహుల్‌ బుద్ధి, జావీద్‌ అలీ, యశ్‌ గుప్తా, రిషబ్‌ బస్లాస్, టీపీ అనిరుధ్, గణేశ్‌. డీబీ రవితేజ (హెడ్‌ కోచ్‌), పవన్‌ కుమార్‌ (అసిస్టెంట్‌ కోచ్‌), రొనాల్డ్‌ రోడ్రిగ్స్‌ (ఫీల్డింగ్‌ కోచ్‌), రియాజ్‌ ఖురేషి (టీమ్‌ మేనేజర్‌), సుభాశ్‌ పాత్రో (స్ట్రెంత్‌ అండ్‌  కండిషనింగ్‌ కోచ్‌), సంతోష్‌ (ఫిజియో), కృష్ణా రెడ్డి (వీడియో ఎనలిస్ట్‌), సాజిద్‌ హుస్సేన్‌ (మసాజర్‌).  

>
మరిన్ని వార్తలు