AUS vs WI: టిమ్‌ డేవిడ్‌ తుపాన్‌ ఇన్నింగ్స్‌.. 110 మీటర్ల భారీ సిక్స్‌

8 Oct, 2022 13:26 IST|Sakshi

బ్రెస్బేన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా యువ ఆటగాడు టిమ్‌ డేవిడ్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతులు ఎదుర్కొన్న డేవిడ్‌.. 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు సాధించాడు. కాగా డేవిడ్‌ కొట్టిన ఓ సిక్సర్‌ మ్యాచ్‌ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ వేసిన మెక్‌కాయ్‌ బౌలింగ్‌లో.. నాలుగో బంతిని డేవిడ్ డిప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా 110 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో  షేర్‌ చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై ఆస్ట్రేలియా 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో ఆసీస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.

ఆసీస్‌ బ్యాటర్లలో డేవిడ్‌ వార్నర్‌(41 బంతుల్లో 75), డేవిడ్‌(42) పరుగులతో అదరగొట్టారు. విండీస్‌ బౌలర్లలో జోషఫ్‌ మూడు వికెట్లు, మెక్‌కాయ్‌ రెండు, స్మిత్‌ ఒక్క వికెట్‌ సాధించారు. ఇక 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. కరీబియన్‌ బ్యాటర్లలో చార్లెస్‌ 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కమ్మిన్స్‌ రెండు, గ్రీన్‌, జంపా ఒ‍క్క వికెట్‌ పడగొట్టారు.
చదవండి: Faf Du Plesis: 'మరో మూడు వారాల్లో పూర్తిగా తెలుసుకుంటారు'

మరిన్ని వార్తలు