'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా'

12 Jan, 2021 15:42 IST|Sakshi

సిడ్నీ: టీమిండియాతో జరిగిన మూడో టెస్ట్‌లో ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్ భారత్‌ బౌలర్‌ అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలపై అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో పైన్‌ తన ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పుకున్నాడు. భారత స్పిన్నర్‌ అశ్విన్‌పై తాను చేసిన వ్యాఖ్యల పట్ల సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టిమ్‌ పైన్ మాట్లాడాడు. (చదవండి: ‘భారత్‌కు వచ్చినప్పుడు చూపిస్తా’)

'అశ్విన్‌తో అలా ప్రవర్తించి ఉండకూడదు..నా చర్యకు సిగ్గుపడుతున్నా.భవిష్యత్‌లో ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉంటానన్నాడు.తన మాటలతో తప్పుడు సంకేతాలిచ్చానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. మైదానంలో స్టంప్‌మైక్‌ ఉంటుందన్న విషయం తెలిసి కూడా దురదృష్టవశాత్తూ నా మాటలతో తప్పుడు సంకేతాలిచ్చాను. అది తెలిసి చాలా బాధపడ్డాను. ఆటలో జాగ్రత్తగా ఉండాలని నిన్న జరిగిన చర్యతో తెలుసుకున్నాడు. భవిష్యత్తులో ఇలా జరగకుండా మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తా.' అని పైన్‌ పేర్కొన్నాడు.

సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి నుంచి గట్టెక్కిన విషయం తెలిసిందే. హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ నిలకడైన బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. అయితే ఈ ఇద్దరి బ్యాటింగ్‌కు విసిగిపోయిన పైన్.. స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. కాగా ఆటలో భాగంగా మూడోరోజు కూడా పైన్‌ పుజారా ఔట్‌ విషయంలోనూ ఫీల్డ్‌ అంపైర్‌ విల్సన్‌పై మండిపడిన విషయం తెలిసిందే. అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినందుకు  పైన్‌పై ఐసీసీ నిబంధన 2.8 ప్రకారం మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కేటాయించారు.(చదవండి: స్టీవ్‌ స్మిత్‌..  మళ్లీ చీటింగ్‌ చేశాడు..!)

మరిన్ని వార్తలు