Tim Paine: 'ఆ భారత క్రికెటర్‌లు మొత్తం సిరీస్‌నే రిస్క్‌లో పెట్టారు'

17 Jun, 2022 19:27 IST|Sakshi

2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ.. టీమిండియా అత్యున్నతమైన టెస్టు సిరీస్ విజయాల్లో ఇది ఒకటి. విరాట్‌ కోహ్లి సారథ్యంలో భారీ అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన టీమిండియా..  ఆడిలైడ్ వేదికగా జరగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే ఆలౌట్ అయ్యి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. తొలి టెస్టు అనంతరం వ్యక్తిగత కారణాలతో కెప్టెన్‌ కోహ్లి తిరిగి స్వదేశానికి వచ్చేశాడు. దీంతో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు ఆజింక్యా రహానే చేపట్టాడు. అయితే మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడిలైడ్‌ ఓటమికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టుకు ముందు హై డ్రామా నడిచింది. కొంతమంది భారత ఆటగాళ్లు బయో బబుల్‌ను ఉల్లంఘించి రెస్టారెంట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో..ఈ విషయం అప్పటిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే రెస్టారెంట్‌కు వెళ్లిన ఆటగాళ్ల అందరికి కొవిడ్‌ పరీక్షలలో నెగిటివ్‌ తేలడంతో మూడు టెస్టుకు అందుబాటులో ఉన్నారు. తాజాగా వూట్‌ అనే ప్లాట్‌ఫామ్‌.. ఆస్ట్రేలియా-భారత్‌ సిరీస్‌ను‘బందో మే త దమ్’ అనే డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించింది. అయితే తాజాగా ఇదే విషయంపై అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ మరోసారి గుర్తుచేశాడు.

"నలుగురు, ఐదుగురు భారత ఆటగాళ్లు మొత్తం టెస్ట్ సిరీస్‌ను రిస్క్‌లో పెట్టారు. వారు ఫుడ్‌ కోసం వెళ్లారో ఎందుకోసం వెళ్లారో నాకు తెలియదు గానీ, కాస్త నిజాయితీగా వ్యవహరించి ఉంటే బాగుండేది" అని టిమ్‌ పైన్‌ పేర్కొన్నాడు. ఇక ఇదే విషయంపై పాట్‌ కమిన్స్ మాట్లాడూతూ.. "భారత క్రికెటర్‌లు అలా చేయడం మా జట్టులోని చాలా మంది ఆటగాళ్లకి చికాకు క‌లిగించింది. ఎందుకంటే వారి కుటుంబాలతో క్రిస్మస్‌ సంబరాలు జరపుకోకుండా ఈ సిరీస్‌కు  బయోబబ్‌లలో ఉన్నారు. మా జట్టు అన్నిటిని త్యాగం చేసి ఈ సిరీస్‌కు సిద్దమైంది. అయితే పర్యటక జట్టు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదు" అని పాట్‌ కమిన్స్ తెలిపాడు. కాగా ఈ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. 
చదవండి: Tim Paine Thanks Rahane: 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్‌ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు'

మరిన్ని వార్తలు