T20 WC 2022: టిమ్‌ సౌథీ అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా

22 Oct, 2022 14:52 IST|Sakshi

అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సౌథీ నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌-2022 సూపర్‌-12లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ ఔట్‌ చేసిన సౌథీ... ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పటి వరకు 101 మ్యాచ్‌లు ఆడిన సౌథీ.. మొత్తంగా 123 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఈ ఘనత బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ షకీబ్‌ ఆల్‌ హాసన్‌ పేరిట ఉండేది. షకీబ్‌ ఇప్పటి వరకు 104 మ్యాచ్‌ల్లో 122 వికెట్లు సాధించాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో  సౌథీ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్‌ బౌలర్‌గా నాథన్‌ మెక్‌ కల్లమ్‌తో కలిసి సమంగా నిలిచాడు. ఇక ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్‌లు కలిపి ఇప్పటి వరకు 337 మ్యాచ్‌లు ఆడిన సౌథీ.. 669 వికెట్లు సాధించాడు.

A post shared by ICC (@icc)


చదవండి: Devon Conway: కాన్వే అరుదైన ఘనత.. బాబర్‌తో కలిసి సంయుక్తంగా

>
మరిన్ని వార్తలు