T20 WC 2022: శ్రీలంకతో మ్యాచ్‌.. కివీస్‌కు గుడ్‌ న్యూస్‌! అతడు వచ్చేస్తున్నాడు

29 Oct, 2022 08:37 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో న్యూజిలాండ్‌ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆక్టోబర్‌ 29(శనివారం) సిడ్నీ వేదికగా శ్రీలంకతో కివీస్‌ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఓ గుడ్‌ న్యూస్‌ అందింది. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు దూరమైన కివీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ డార్లీ మిచిల్‌ ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్‌  టిమ్ సౌథీ కూడా దృవీకరించాడు.  "కొన్ని రోజుల కిందట గాయ పడ్డ మిచిల్‌ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. మిచిల్‌ శ్రీలంకతో మ్యాచ్‌కు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. మార్క్ చాప్‌మన్‌ స్థానంలో డారిల్‌ జట్టులోకి రానున్నాడు. మిచిల్‌ మా జట్టులో కీలక సభ్యుడు. అతడు గతంలో మా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఈ మెగా ఈవెంట్‌లో కూడా డారిల్‌ తన స్థాయికి తగ్గట్టు రాణిస్తాడని అశిస్తున్నాను" అని సౌథీ పేర్కొన్నాడు. కాగా గతేడాది ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరడంలో మిచిల్‌ది కీలక పాత్ర. ఇక పాయింట్ల పట్టికలో గ్రూప్‌-1 నుంచి న్యూజిలాండ్‌ 3 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. కాగా ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ రద్దు కావడంతో కివీస్‌ ఖాతాలో ఒక్క పాయింట్‌ చేరింది.
చదవండిMohammad Wasim Jr: పరుగు కోసం రూల్స్‌ మరిచాడు.. పాక్ బ్యాటర్‌ తప్పిదం

మరిన్ని వార్తలు