గంటల వ్యవధిలో ఇద్దరు ఆటగాళ్ల రిటైర్మెంట్‌ ప్రకటన

30 Sep, 2021 19:55 IST|Sakshi

Olympic Bronze Medalist Rupinder Singh, Birendra Lakra Retired: టోక్యో ఒలింపిక్స్‌ పురుషుల హాకీలో భారత్‌ కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఇద్దరు స్టార్‌ క్రీడాకారులు గంటల వ్యవధిలో రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించారు. తొలుత డ్రాగ్‌ ఫ్లికర్‌గా పేరుగాంచిన రూపిందర్‌ పాల్‌ సింగ్‌ అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించగా.. గంటల వ్యవధిలో మరో స్టార్‌ ఆటగాడు, డిఫెండర్‌ బీరేంద్ర లక్రా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెల్లడించాడు. రూపిందర్‌ గురువారం ట్విటర్‌ వేదికగా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించగా..  బీరేంద్ర లక్రా వీడ్కోలు పలుకుతున్న విషయాన్ని ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే రిటైర్‌ అవుతున్నట్లు ఈ ఇద్దరూ ప్రకటించారు. భారత హాకీకి చేసిన సేవలకు గాను హాకీ ఇండియా వీరిద్దరిని అభినందించింది. 

ఇదిలా ఉంటే, దేశంలో అత్యుత్తమ డ్రాగ్‌ ఫ్లికర్‌గా గుర్తింపు పొందిన 30 ఏళ్ల రూపీందర్‌ పాల్‌.. భారత్‌ తరఫున 223 మ్యాచ్‌ల్లో 119 గోల్స్‌ సాధించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో అతను నాలుగు కీలక గోల్స్‌ సాధించి జట్టు పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, 31ఏళ్ల బీరేంద్ర లక్రా విషయానికొస్తే.. టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన అతను.. 201 మ్యాచ్‌ల్లో 10 గోల్స్‌ సాధించాడు. 2014లో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టులో లక్రా కీలక సభ్యుడు.
చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో ఆర్సీబీ బౌలర్‌ సరికొత్త రికార్డు..

మరిన్ని వార్తలు