Tokyo Olympics 2020: భారత్‌ గెలిచే పతకాల సంఖ్య ఎంత అనుకుంటున్నారు..

23 Jul, 2021 19:59 IST|Sakshi

న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఒలంపిక్స్‌ క్రీడలు ఎట్టకేలకు ఆరంభమయ్యాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన టోక్యో ఒలంపిక్స్‌ ప్రారంభ వేడుక శుక్రవారం మొదలైంది. మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో నిరాండబరంగానే ఈ మెగా ఈవెంట్‌కు శంఖం పూరించారు. మొత్తం 42 వేదికల్లో... 33 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రపంచ దేశాల నుంచి మొత్తంగా 11,500 మంది ఇందులో పాల్గొననున్నారు. మొత్తం 339 స్వర్ణ పతకాలు అందుబాటులో ఉన్నాయి.

ఇక గత రియో ఒలంపిక్స్‌లో భారత్‌ రెండు పతకాలు మాత్రమే సాధించి పతకాల పట్టికలో 67వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు రజత పతకం... మహిళల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ (58 కేజీల విభాగం)లో హరియాణాకు చెందిన సాక్షి మాలిక్‌ కాంస్య పతకం గెలుచుకున్నారు. వీటితో కలిపి ఒలింపిక్‌ క్రీడల చరిత్రలో మొత్తంగా భారత్‌ ఇప్పటి వరకు... గెలుచుకున్న పతకాల సంఖ్య 28. ఇందులో 9 స్వర్ణాలు, 7 రజతాలు, 12 కాంస్యాలు ఉన్నాయి.

గెస్‌ చేయండి.. రూ. 5 వేలు గెలుచుకోండి!
మరి, ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న భారత్‌... ఈసారి ఒలంపిక్స్‌లో ఎన్ని పతకాలు గెలుచుకుంటుంది? గతేడాది నిరాశపరిచిన ఆటగాళ్లు.. ఈసారైనా స్వర్ణ పతకాన్ని సాధిస్తారా? అన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడున్న ఆటగాళ్లు, వారి ప్రతిభ, బలాబలాల గురించి మీకు అవగాహన ఉందా? ఈసారి భారత్‌ ఎన్ని పతకాలు గెలుచుకుంటుందో అంచనా వేయగలరా? ఒకవేళ మీకు ఈ అంశాలపై ఆసక్తి ఉంటే.. భారత్‌ ఏ విభాగంలో, ఎన్ని స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధిస్తుందో గెస్‌ చేయండి. కచ్చితమైన గణాంకాలు చెప్పిన టాప్‌-3 పాఠకులకు Sakshi.com 5 వేల చొప్పున నగదు బహుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం... కింద కామెంట్‌ బాక్స్‌లో మీ అంచనా తెలియజేసి సాక్షి.కామ్‌ ఇచ్చే గిఫ్ట్‌ను అందుకోండి!​

మరిన్ని వార్తలు