ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవం ప్రారంభం..

23 Jul, 2021 16:48 IST|Sakshi

టోక్యోకోవిడ్‌ దెబ్బతో పలుమార్లు వాయిదాపడిన ఒలింపిక్స్‌ క్రీడలు ఎట్టకేలకు లాంఛనంగా ప్రారంభయ్యాయి. జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవాలు భారత కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు మొదలయ్యాయి. ఒలింపిక్స్‌ క్రీడలను  జపాన్ చక్రవర్తి నరహిటో  ప్రారంభించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం 1000 అతిథుల సమక్షంలో ఆరంభోత్సవం జరిగింది. భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ భారత జెండాని పట్టుకుని భారత బృందాన్ని నడిపించారు.

203 దేశాల నుంచి వచ్చిన దాదాపు 11వేల మంది అథ్లెట్లు ఈ మెగా టోర్నీలో సత్తాచాటేందుకు సిద్దంగా ఉన్నారు. భారత్ నుంచి 119 మంది క్రీడాకారులు టోక్యో‌ ఒలింపిక్స్‌ లో పాల్గొంటున్నారు. ఇందులో 67 మంది ఫురుషులు, 52 మంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకూ టోక్యో ఒలింపిక్స్ జరగనున్నాయి. మరోవైపు టోక్యో ఒలింపిక్స్‌లో సత్తాచాటే అథ్లెట్లకి భారత ఒలింపిక్ సంఘం నగదు పురస్కారాలని ప్రకటించింది. స్వర్ణం గెలిస్తే రూ.75 లక్షలు, రజతానికి రూ.40 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షలు చొప్పున అథ్లెట్లకి ఇవ్వనున్నట్లు తెలిపింది. అలానే టోక్యోలో ఉన్న అథ్లెట్లకి రోజువారి భత్యం కింద రూ.3,723 ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు