Tokyo Olympics: కండోమ్‌తో ప్రయోగం ఆమెకు పతకం వచ్చేలా చేసింది

30 Jul, 2021 13:18 IST|Sakshi

టోక్యో: ఆస్ట్రేలియాకు చెందిన స్లాలోమ్ క‌నోయిస్ట్.. జెస్సికా ఫాక్స్ కండోమ్‌తో చేసిన ప్రయోగం ఆమెకు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, క్యాంస్య పతకం వచ్చేలా చేసింది.  ఒలింపిక్స్‌లాంటి గేమ్స్‌లో సాధార‌ణంగా అథ్లెట్ల‌కు కండోమ్‌లు ఇవ్వడం సాధారణం.  సుర‌క్షిత శృంగారం చేయాల‌న్న‌ ఉద్దేశంతో ఒలింపిక్స్‌ గేమ్స్ విలేజ్‌లో కండోమ్‌లను ఫ్రీగా ఇస్తారు.

అయితే జెస్సికా మాత్రం కండోమ్‌ను ప్రయోగానికి ఉపయోగించింది. త‌న క‌యాక్ (చిన్న ప‌డ‌వ‌)ను రిపేర్ చేయ‌డానికి కండోమ్‌ను ఉపయోగించింది. తన కయాక్‌కు చివరలో ఒక చిన్న రంద్రం ఏర్పడింది. ఆ రంధ్రంలో ఒక కార్బన్‌ మిశ్రమాన్ని పెట్టి దానిపై కండోమ్‌తో పూడ్చివేసింది. ఆ తర్వాత ఇదే కయాక్‌ను ఉపయోగించి బరిలోకి దిగిన జెస్సికా వుమెన్స్‌ సీ1 కానో సాలోమ్‌లో స్వర్ణం.. కానో సాలోమ్‌ కె1 ఫైనల్‌లో క్యాంస్యం గెలుచుకుంది. అలా కండోమ్‌ను తన కయాక్‌కు ఉపయోగించిన జెస్సికా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది. కయాక్‌కు కండోమ్‌ను ఉపయోగించిన విధానానికి సంబంధించిన వీడియోనూ ఇన్‌స్టాలో షేర్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

A post shared by The Highlights Club (@thehighlightsclubau)

>
మరిన్ని వార్తలు