Tokyo olympics: శృంగారంలో పాల్గొనకుండా.. క్యా ఐడియా సర్‌ జీ!

19 Jul, 2021 11:36 IST|Sakshi

Tokyo olympics:  జూలై నెల చివరి వారంలో ప్రారంభంకానున్న విశ్వ క్రీడలకు ప్రపంచ అథ్లెట్లు సంసిద్ధమవుతున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది ఒలింపిక్స్‌ నిర్వహణ కత్తి మీద సాములా మారిందని చెప్పాలి. ఈ క్రమంలో అథ్లెట్ల మధ్య శృంగార కట్టడికి నిర్వాహకులు వినూత్న ఆలోచనను అమలు చేశారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు రొమాన్స్‌ లో పాల్గొనకుండా ఒలింపిక్‌ గ్రామంలోని వా‍ళ్లు బస చేస్తున్న గదుల్లో విచిత్రమైన బెడ్లను ఏర్పాటు చేశారు.

అట్టలతో తయారు చేసిన మంచాలను క్రీడాకారుల గదులో ఉంచారు. దీనివల్ల ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనే వీలుండదని అని వారి యోచన. ఒలింపిక్స్‌ ముగిశాక వీటిని రీసైక్లింగ్‌ చేసి కాగితపు ఉత్పత్తులుగా మార్చనున్నారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. జూలై 24న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ సందర్భంగా ఆటగాళ్ల బస కోసం 18,000 పడకలు అవసరం కాగా, పారా ఒలింపిక్స్‌కు 8,000 పడకలు మాత్రమే అవసరం అయ్యాయి.  ప్రస్తుతం ఈ బెడ్ల ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అవి వైరల్‌ గా మారి హల్‌ చల్‌ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇవి గరిష్టంగా 200 కిలోల బరువు వరకు ఆపగలవని, యాంటీ సెక్స్‌ బెడ్స్‌ కథనాలను తోసిపుచ్చుతున్నారు ఒలింపిక్‌ నిర్వాహకులు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు