టోక్యో ఒలింపిక్స్‌: ఆర్చరీ సీడింగ్‌ రౌండ్‌లో దీపికకు 9వ స్థానం

23 Jul, 2021 11:56 IST|Sakshi

టోక్యో: ప్రపంచ నంబర్‌వన్‌, భారత మహిళా ఆర్చర్ దీపికా కుమారి టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా ఆర్చరీ విభాగం వ్యక్తిగత రికర్వ్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో నిరాశపరిచింది.  శుక్రవారం ఉదయం యుమెనొషిమా పార్క్‌లోని ఆర్చరీ ఫీల్డ్‌లో జరిగిన క్వాలిఫకేషన్ రౌండ్‌లో దీపికా కుమారి 9వ స్థానంలో నిలిచింది. తొలి హాఫ్ సమయానికి 4వ స్థానంలో నిలిచిన దీపిక.. మిగిలిన హాఫ్‌ సమయంలో పలుమార్లు గురి కోల్పోయి మొత్తం రౌండ్ ముగిసే సరికి 663 పాయింట్లతో 9వ స్థానానికి పడిపోయింది. ఇక సీడింగ్‌ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన ఆర్చర్ సాన్‌ ఆన్‌ 680 పాయింట్లతో రికార్డు సృష్టించింది.

క్వాలిఫికేషన్ రౌండ్ ముగిసే సరికి టాప్ 3లో సౌత్ కొరియా ఆర్చర్లే ఉండటం గమనార్హం. వరల్డ్ నెంబర్ 1 దీపికా కుమారి ప్రస్తుతం క్వాలిఫికేషన్ రౌండ్‌లో 9వ ర్యాంక్ సంపాదించింది. అయితే జులై 28 నుంచి ప్రారంభం కానున్న రౌండాఫ్ 32 ఎలిమినేషన్ రౌండ్స్‌లో దీపిక పాల్గొననుంది. ఆమె భూటాన్‌కు చెందిన కర్మతో రౌండాఫ్ 32లో తలపడనున్నది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు