4 సార్లు చాంపియన్‌.. సెకండ్ల వ్యవధిలో మిస్సయ్యాడు

26 Jun, 2021 18:08 IST|Sakshi

ఒలంపిక్స్‌లో పాల్గొనాలని ప్రతి ఒక్క అథ్లెట్‌ కల. అందుకోసం వాళ్లు ఏళ్ల తరబడి సాధన చేస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం, ప్రతిష్టాత్మక టోర్నికి 19 సెకన్ల ఆలస్యం వల్ల అర్హత కోల్పోతే ఆ బాధ వర్ణించలేం. అది కూడా మొదటి సారి ఒలంపిక్స్‌లో అడుగుపెడుతున్న అథ్లెట్‌ కాదు ఏకంగా 4 సార్లు చాంపియన్‌గా నిలిచిన వ్యక్తి  ఇలా చేజార్చుకున్నాడంటే నమ్మలేం కదా ? కానీ ఇది నిజం.

తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నాడు 4 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన మో ఫారా. శుక్రవారం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన 10వేల మీటర్ల ఒలంపిక్స్‌ అర్హత పోటీల్లో.. అతను కొద్దిలో గమ్యాన్ని చేరలేకపోయాడు. 27 నిమిషాల 28 సెకన్లలో టార్గెట్‌ను చేరుకోవాల్సి ఉండగా, మో ఫారా 27నిమిషాల 47 సెకన్లలో రేసు పూర్తి చేశాడు. దీంతో అతను మరో సారి ఒలంపిక్స్‌లో ఐదో సారి చాంపియన్‌గా నిలవాలన్న మో పారా నిరాశగా వెనుదిరాగాల్సి వచ్చింది. 

చదవండి: టోక్యో ఒలింపిక్స్‌: పీవీ సింధుకి అరుదైన గౌరవం..

మరిన్ని వార్తలు