Tokyo Olympics 2020 : పతకాల ఆశల పల్లకిలో..

22 Jul, 2021 07:38 IST|Sakshi

18 క్రీడాంశాల్లో 127 మంది బరిలోకి

ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ తరఫున ఇదే అతిపెద్ద బృందం 

కోచ్‌లు, సహాయక సిబ్బంది, అధికారులతో కలిపి మొత్తం 228 మంది

ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచి్చంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో పీవీ సింధు రజతం సాధించగా... మహిళల రెజ్లింగ్‌లో సాక్షి మలిక్‌ కాంస్య పతకం కైవసం చేసుకుంది. ‘రియో’ క్రీడల్లో భారత్‌ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ‘రియో’ వైఫల్యం తర్వాత కేంద్ర క్రీడా శాఖ భారత క్రీడారంగాన్ని బలోపేతం చేసేందుకు నడుం బిగించింది. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)ను రూపొందించి ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉన్న క్రీడాకారులను ఎంపిక చేసి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది.

ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి అత్యధికంగా 18 క్రీడాంశాల్లో 127 మంది క్రీడాకారులు పతకాల వేటకు వెళ్లనున్నారు. గత ఐదేళ్ల కాలంలో భారత క్రీడాకారులు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తుండటం... మేటి క్రీడాకారులను మట్టికరిపిస్తూ పతకాలు కొల్లగొడుతుండటంతో... టోక్యో ఒలింపిక్స్‌లో మనోళ్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడూలేని విధంగా ఈసారి ఒలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య రెండంకెలు దాటుతుందని అందరూ విశ్వసిస్తున్నారు. ఇటీవల కాలంలో భారత క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా ఆర్చరీ, షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాంశాల్లో భారత్‌కు కచ్చితంగా పతకాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత క్రీడాకారుల వివరాలు, షెడ్యూల్‌ మీ కోసం...


హాకీ (38) 
పురుషుల జట్టు (19): శ్రీజేష్‌ (గోల్‌కీపర్‌), మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ సింగ్, రూపిందర్‌ పాల్‌ సింగ్, సురేందర్‌ కుమార్, అమిత్‌ రోహిదాస్, బీరేంద్ర లాక్రా, హార్దిక్‌ సింగ్, వివేక్‌ సాగర్‌ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్, షంషేర్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, లలిత్‌ ఉపాధ్యాయ్, మన్‌దీప్‌ సింగ్‌. స్టాండ్‌బై: వరుణ్‌ కుమార్, సిమ్రన్‌జిత్‌ సింగ్,  కృషన్‌ పాఠక్‌ (గోల్‌కీపర్‌). 
మహిళల జట్టు (19): సవితా పూనియా (గోల్‌కీపర్‌), రాణి రాంపాల్‌ (కెపె్టన్‌), షర్మిలా దేవి, దీప్‌ గ్రేస్‌ ఎక్కా, వందన కటారియా, గుర్జిత్‌ కౌర్, నవ్‌జ్యోత్‌ కౌర్, నవ్‌నీత్‌ కౌర్, లాల్‌రెమ్‌సియామి, మోనిక, నేహా, నిషా, నిక్కీ ప్రధాన్, సుశీలా చాను, సవితా పూనియా, సలీమా టెటె. స్టాండ్‌బై: రీనా, నమితా టొప్పో, రజని (గోల్‌కీపర్‌). 
షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 6

షూటింగ్‌ (15) 
మహిళల విభాగం 
అంజుమ్‌ మౌద్గిల్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్, 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌), తేజస్విని (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌), ఇలవేనిల్‌ (10 మీటర్ల ఎయిర్‌రైఫిల్, మిక్స్‌డ్‌ ఈవెంట్‌), అపూర్వీ చండేలా (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌), మనూ భాకర్‌ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, 25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌), యశస్విని(10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, మిక్స్‌డ్‌ ఈవెంట్‌), రాహీ సర్నోబత్‌ (25 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌) 
పురుషుల విభాగం 
దివ్యాంశ్, దీపక్‌ (10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్, మిక్స్‌డ్‌ ఈవెంట్‌), సంజీవ్‌ రాజ్‌పుత్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ (50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌), సౌరభ్‌ చౌదరీ, అభిõÙక్‌ వర్మ (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, మిక్స్‌డ్‌ ఈవెంట్‌), మేరాజ్‌ అహ్మద్‌ ఖాన్, అంగద్‌ (స్కీట్‌ ఈవెంట్‌) 
షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 2 

టేబుల్‌ టెన్నిస్‌ (4) 
పురుషుల సింగిల్స్‌: శరత్‌ కమల్, సత్యన్‌
మహిళల సింగిల్స్‌: మనిక బత్రా, సుతీర్థ
మిక్స్‌డ్‌ డబుల్స్‌: శరత్‌ కమల్‌–మనిక బత్రా 
షెడ్యూల్‌: జూలై 24 నుంచి 27

గోల్ఫ్‌ (3) 
అనిర్బన్, అదితి అశోక్, ఉదయన్‌ మానె 
షెడ్యూల్‌: జూలై 29 నుంచి ఆగస్టు 7


అథ్లెటిక్స్‌ (26) 
పురుషుల విభాగం 
జావెలిన్‌ త్రో: నీరజ్‌ చోప్రా, శివపాల్‌ సింగ్‌ 
20 కి.మీ. నడక: కేటీ ఇర్ఫాన్‌ థోడి, సందీప్‌ కుమార్, రాహుల్‌ రోహిల్లా 
50 కి.మీ. నడక: గుర్‌ప్రీత్‌ సింగ్‌ 
3000 మీ. స్టీపుల్‌ఛేజ్‌: అవినాశ్‌ సాబ్లే 
లాంగ్‌జంప్‌: శ్రీశంకర్‌ 
షాట్‌పుట్‌: తజీందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ 
400 మీటర్ల హర్డిల్స్‌: జాబిర్‌ 
4్ఠ400 మీటర్ల రిలే: అమోల్‌ జేకబ్, రాజీవ్‌ అరోకియా, మొహమ్మద్‌ అనస్, నాగనాథన్‌ పాండి, నోవా నిర్మల్‌ టామ్‌.  
మహిళల 20 కి.మీ. నడక: భావన జట్, ప్రియాంక గోస్వామి 
డిస్కస్‌ త్రో: కమల్‌ప్రీత్, సీమా పూనియా 
100, 200 మీటర్లు: ద్యుతీచంద్‌ 
జావెలిన్‌ త్రో: అన్ను రాణి 
మిక్స్‌డ్‌ 4్ఠ400 మీటర్ల రిలే: సార్థక్‌ బాంబ్రీ, అలెక్స్‌ ఆంటోనీ, రేవతి వీరణమి, సుభా వెంకటేశన్, ధనలక్ష్మి శేఖర్‌ 
షెడ్యూల్‌: జూలై 30 నుంచి ఆగస్టు 7

బాక్సింగ్‌ (9) 
పురుషుల విభాగం: సతీశ్‌ కుమార్‌ (ప్లస్‌ 91 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), వికాస్‌ కృషన్‌ (75 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (63 కేజీలు), అమిత్‌ పంఘాల్‌ (52 కేజీలు) 
మహిళల విభాగం: మేరీకోమ్‌ (51 కేజీలు), సిమ్రన్‌జిత్‌ (60 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు). 
షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 8

స్విమ్మింగ్‌ (3) 
పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌: సజన్‌
పురుషుల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌: శ్రీహరి
మహిళల 100 మీ. బ్యాక్‌స్ట్రోక్‌: మానా పటేల్‌ 
షెడ్యూల్‌: జూలై 25 నుంచి 30

రెజ్లింగ్‌ (7) 
పురుషుల విభాగం: రవి (57 కేజీలు), బజరంగ్‌ (65 కేజీలు), దీపక్‌ (86 కేజీలు). 
మహిళల విభాగం: సీమా (50 కేజీలు), వినేశ్‌ (53 కేజీలు), అన్షు (57 కేజీలు), సోనమ్‌ (62 కేజీలు) షెడ్యూల్‌: ఆగస్టు 3 నుంచి 7

టెన్నిస్‌ (3) 
మహిళల డబుల్స్‌: సానియా, అంకిత రైనా 
పురుషుల సింగిల్స్‌: సుమిత్‌ నగాల్‌ 
షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 1

రోయింగ్‌ (2) 
పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌: అర్జున్‌ లాల్, అరవింద్‌ సింగ్‌ 
షెడ్యూల్‌: జూలై 24

ఆర్చరీ (4) 
పురుషుల రికర్వ్‌ టీమ్, వ్యక్తిగత విభాగం: తరుణ్‌దీప్‌ రాయ్, అతాను దాస్, ప్రవీణ్‌ జాదవ్‌; మహిళల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం: దీపిక కుమారి 
షెడ్యూల్‌: జూలై 23 నుంచి 31

సెయిలింగ్‌ (4) 
మహిళల లేజర్‌ రేడియల్‌: నేత్ర కుమనన్‌ 
పురుషుల లేజర్‌ స్టాండర్డ్‌: విష్ణు శరవణన్‌ 
పురుషుల స్కీఫ్‌ 49 ఈఆర్‌: గణపతి, వరుణ్‌  
షెడ్యూల్‌: జూలై 25 నుంచి 27

రోయింగ్‌ (2) 
పురుషుల లైట్‌ వెయిట్‌ డబుల్‌ స్కల్స్‌: అర్జున్‌ లాల్, అరవింద్‌ సింగ్‌ 
షెడ్యూల్‌: జూలై 24

ఈక్వెస్ట్రియన్‌ (1) 
పురుషుల వ్యక్తిగత ఈవెంటింగ్‌: ఫౌద్‌ మీర్జా 
షెడ్యూల్‌: జూలై 30

బ్యాడ్మింటన్‌ (4) 
మహిళల సింగిల్స్‌: పీవీ సింధు 
పురుషుల సింగిల్స్‌: సాయిప్రణీత్‌ 
పురుషుల డబుల్స్‌: సాతి్వక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి 
షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 2

జూడో (1) 
మహిళల 49 కేజీల విభాగం: సుశీలా దేవి 
షెడ్యూల్‌: జూలై 24

ఈక్వెస్ట్రియన్‌ (1) 
పురుషుల వ్యక్తిగత ఈవెంటింగ్‌: ఫౌద్‌ మీర్జా 
షెడ్యూల్‌: జూలై 30

ఫెన్సింగ్‌ (1) 
మహిళల సాబ్రే ఈవెంట్‌: భవాని దేవి 
షెడ్యూల్‌: జూలై 26

బ్యాడ్మింటన్‌ (4) 
మహిళల సింగిల్స్‌: పీవీ సింధు 
పురుషుల సింగిల్స్‌: సాయిప్రణీత్‌ 
పురుషుల డబుల్స్‌: సాతి్వక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి 
షెడ్యూల్‌: జూలై 24 నుంచి ఆగస్టు 2

వెయిట్‌లిఫ్టింగ్‌ (1)
మహిళల 48 కేజీల విభాగం: మీరాబాయి
షెడ్యూల్‌: జూలై 24

జిమ్నాస్టిక్స్‌ (1)
మహిళల ఆరి్టస్టిక్‌: ప్రణతి నాయక్‌ 
షెడ్యూల్‌: జూలై 25 నుంచి ఆగస్టు 3 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు