ఆ విజయ నాదం ప్రపంచం నలుమూలలా వినిపించేలా..

2 Aug, 2021 20:35 IST|Sakshi

విజయానంతరం భారత మహిళా హాకీ జట్టు స్పందన

సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుతం చేసింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. క్వార్టర్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలాంటి జట్టును మట్టికరిపించి.. సెమీ ఫైనల్‌కు చేరింది. దాదాపు 20 ఏళ్లు వెంటాడిన ఓటమి వారి సమిష్టి కృషి, శ్రమ ముందు తలదించింది. విజయం సొంతమయ్యింది. ఇక ఆ క్షణం వారి స్పందన ఎలా ఉంటుందో వర్ణించడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఈ క్షణాల కోసం వారు ఎన్ని త్యాగాలు చేశారో.. ఎన్ని అడ్డంకులను దాటుకున్నారో వారికే తెలుసు. వాటన్నింటిని ఈ విజయం మరిపించింది.

ఆ క్షణం వారి మనసులోని భావాన్ని వ్యక్తం చేయడానికి మాటలు చాలవు.. అసలు పదాలు దొరకవు. విజయానందాన్ని వ్యక్తం చేయడానికి వెర్రిగా కేకలు వేశారు. గెలుపు కోసం సమిష్టిగా ఎలా కృషి చేశారో.. విజయం సాధించిన అనంతరం అందరూ కలిసి ఐక్యంగా సంతోషాన్ని పంచుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుని అభినందించుకున్నారు. వారి కేకలతో స్టేడియం మార్మోగిపోయింది. ఆ విజయ నాదం ప్రపంచం నలుమూలలా ప్రతిధ్వనించింది. 132 కోట్ల మంది ఆశలని.. సంతోషాన్ని ఆ కొద్ది మందే ప్రపంచానికి వెల్లడించారు.

కోచ్‌లు కూడా తమ వయసును మర్చిపోయి.. సంతోషంతో గెంతులేశారు. ఆ క్షణానా వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని దేనితో వేల కట్టలేం.. పోల్చలేం.. తూచలేం. ఇక వారి సంబరాలకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజనులు వారికి అభినందనలు తెలపుతూ వారి సంతోషంలో తాము భాగం అయ్యారు.  ఇక సెమీస్‌లో భారత మహిళా జట్టు అర్జెంటీనాతో తలపడనుంది.ద

మరిన్ని వార్తలు