Tokyo Olympics: భారత మహిళల హాకీ జట్టు విజయం; ఐర్లాండ్‌ ఓడిపోతేనే

31 Jul, 2021 11:09 IST|Sakshi

టోక్యో: ఒలింపిక్స్‌లో భాగంగా భారత మహిళల హాకీ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ ఆద్యంతం హోరాహోరీగా సాగడం విశేషం. తొలి రెండు క్వార్టర్లలో వందన కటరియా రెండు గోల్స్‌ చేయడంతో  2-1తో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే మూడో క్వార్టర్‌లో మాత్రం కాస్త తడబడింది. దీంతో సౌతాఫ్రికా మూడో క్వార్టర్‌లో రెండు గోల్స్‌ నమోదు చేసి 3-3తో స్కోరును సమం చేసింది. కీలకమైన నాలుగో క్వార్టర్‌లో వందన కటారియా మరో గోల్‌తో మెరవడంతో భారత్‌ 4-3తో ఆధిక్యంలోకి వెళ్లింది.

ఆట ముగిసేలోపూ భారత ఢిపెన్స్‌ టీమ్‌ సౌతాప్రికాను మరో గోల్‌ చేయకుండా నిలువరించడంతో విజయాన్ని అందుకుంది. కాగా భారత్‌ ఈ విజయంతో లీగ్‌ దశలో ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు.. మూడు ఓటములతో కలిపి 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్‌ క్వార్టర్స్‌ చేరాలంటే ఐర్లాండ్‌- గ్రేట్‌ బ్రిటన్‌ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఓడిపోవాలి. అలా కాకుంటే మ్యాచ్‌ డ్రా అయినా భారత్‌ క్వార్టర్స్‌కు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ ఐర్లాండ్‌ గెలిస్తే మాత్రం భారత మహిళల జట్టు ఇంటిముఖం పడుతుంది.

మరిన్ని వార్తలు