Tokyo Olympics: అదరగొట్టిన కెన్యా అథ్లెట్‌.. వరుస ఒలింపిక్స్‌లో

9 Aug, 2021 08:50 IST|Sakshi

టోక్యో: పురుషుల మారథాన్‌ రేసులో తనకు తిరుగులేదని కెన్యా అథ్లెట్‌ ఎలూయిడ్‌ కిప్‌చోగె మరోసారి నిరూపించాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో మెరిసిన అతడు... ఐదేళ్ల తర్వాత జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేశాడు. ఆదివారం జరిగిన ఈ మారథాన్‌ రేసులో (42.195 కిలోమీటర్లు) కిప్‌చోగె 2 గంటల 8 నిమిషాల 38 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం సాధించాడు. ఒలింపిక్స్‌లో కిప్‌చోగెకిది నాలుగో పతకం కాగా... ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి. 

అంతేకాకుండా పురుషుల మారథాన్‌లో రెండు పసిడి పతకాలు సాధించిన మూడో అథ్లెట్‌గా కిప్‌చోగె నిలిచాడు. గతంలో అబెబె బికిలా (ఇథియోపియా–1960, 64), వాల్దెమర్‌ సిరి్పన్‌స్కి (జర్మనీ–1976, 80) కిప్‌చోగె కంటే ముందు ఈ ఘనతను సాధించారు. మొత్తం 106 మంది ఈ మారథాన్‌లో పాల్గొనగా... 30 మంది రేసును పూర్తి చేయకుండా మధ్యలోనే వైదొలిగారు.
చదవండి: Tokyo Olympics: 37 ఏళ్ల తర్వాత ఫ్రాన్స్‌ తొలిసారిగా..

మరిన్ని వార్తలు