Tokyo Olympics: ఫినిషింగ్‌ మెరుగుపడితేనే...

5 May, 2021 08:22 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు పతకం గెలిచే అవకాశాలు

ఫార్వర్డ్‌ లలిత్‌ ఉపాధ్యాయ్‌ వ్యాఖ్య

బెంగళూరు: అందివచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడంపై ఆటగాళ్లు దృష్టి సారించాలని భారత హాకీ జట్టు ఫార్వర్డ్‌ ప్లేయర్‌ లలిత్‌ ఉపాధ్యాయ్‌ అభిప్రాయపడ్డాడు. మైదానంలో ప్లేయర్లు చురుకుగా కదులుతూ ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ గోల్‌ పోస్ట్‌ను సమీపించినా ఫినిషింగ్‌ మాత్రం అనుకున్న స్థాయిలో లేదని... అందులో భారత జట్టు మెరుగు పడాలని లలిత్‌ పేర్కొన్నాడు. ఇలా జరిగితేనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ మెరుగైన ప్రదర్శనను కనబర్చగలదని లలిత్‌ అన్నాడు. ఈసారి జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు.

ఇటీవల ముగిసిన అర్జెంటీనా పర్యటనలో భారత్‌ నాలుగు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో పాటు... రెండు ప్రొ లీగ్‌ హాకీ టోర్నీ మ్యాచ్‌లను ఆడింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో 12 గోల్స్‌ చేసిన భారత్‌... ప్రొ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌ చేసింది. ప్రస్తుతం ఒలింపిక్స్‌ కోసం భారత హాకీ బృందం బెంగళూరులోని ‘సాయ్‌’లో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో పాల్గొంటోంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. భారత్‌ గ్రూప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనాతోపాటు ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, స్పెయిన్‌ జట్లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు