Tokyo Olympics: పాపం రష్యా.. పతకాలు గెలిచినా జాతీయ గీతం వినిపించదు

28 Jul, 2021 09:56 IST|Sakshi

టోక్యో: రష్యా స్విమ్మర్లు రిలోవ్, కొలెస్నికోవ్‌ అమెరికన్ల ‘కనక’పు కోటని బద్దలు కొట్టి మరీ బంగారు, రజత పతకాలు గెలిచారు. మరో వైపు జిమ్నాస్ట్‌లు అమెరికా మెరుపు విన్యాసాలకు చెక్‌ పెట్టారు. అకయిమోవా, లిస్టునోవా, మెల్నికొవా, వురజొవాతో కూడిన రష్యా జట్టు అమెరికా హ్యాట్రిక్‌ స్వర్ణావకాశాన్ని దెబ్బతీసి మరీ విజేతగా నిలిచింది. ఇంతటి ఘనవిజయాలు సాధించిన రష్యన్లకు పోడియం వద్ద అసంతృప్తే దక్కుతోంది.

వ్యవస్థీకృత డోపింగ్‌ ఉదంతంతో రష్యా దేశంపై నిషేధం కొనసాగుతుండడమే దీనికి కారణం. అయితే నిష్కళంక అథ్లెట్లను మాత్రం రష్యా ఒలింపిక్‌ కమిటీ (ఆర్‌ఓసీ) జెండా కింద పోటీపడేందుకు అవకాశమిచ్చింది. దీంతో పోడియంలో వారి మెడలో పతకాలు పడినా అక్కడ జాతీయ గీతం వినిపించదు. ఓ సంగీతం వినిపిస్తారు. జెండా బదులు ఆర్‌ఓసీ జెండాను ఎగరేస్తారు. ఇది రష్యా అథ్లెట్లకు పతకం గెలిచిన ఆనందాన్ని దూరం చేస్తోంది
 

మరిన్ని వార్తలు