Tokyo Olympics: ‘స్వర్ణం’ వేటలో ముగిసిన సింధు పోరాటం

31 Jul, 2021 19:16 IST|Sakshi

టోక్యో: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకువచ్చిన సింధు.. తైజుయింగ్‌(చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది. వరుస గేమ్‌లలో సింధుపై ఒత్తిడి పెంచిన తైజు.. 21-18, 21-12 తేడాతో ఆమెను ఓడించింది. తద్వారా ఎట్టకేలకు తొలి ఒలింపిక్‌ పతక వేట బరిలో తైజు నిలవగా... పీవీ సింధు ఫైనల్‌ చేరకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. కాంస్య పతక ఆశలు సజీవంగా ఉండటం ఊరటనిచ్చే అంశంగా పరిణమించింది.

ఇక అంతకు ముందు జరిగిన సెమీస్‌-1 మ్యాచ్‌లో చైనా షట్లర్‌ చెన్‌ యూ ఫెయ్‌, హీ బింగ్‌ జియాను ఓడించి ఫైనల్‌ చేరింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 21-16, 13-21, 21-12 తేడాతో ఆమె గెలుపొందింది. సెమీస్‌-2లో పీవీ సింధుపై తైజుయింగ్‌ గెలిచిన నేపథ్యంలో చెన్‌- తైజు మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. మరోవైపు హీ బింగ్‌ జియాతో సింధు గెలిస్తే కాంస్య పతకం ఖాయమవుతుంది. రియో ఒలింపిక్స్‌లో సింధు రజతం గెలిచిన సంగతి తెలిసిందే.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు