Avani Lekhara: ‘గోల్డెన్‌ గర్ల్‌’ విజయంపై సర్వత్రా హర్షం

30 Aug, 2021 11:26 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత మహిళా షూటర్‌ అవని లేఖారాపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణం చేరడమే కాకుండా పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా 19 ఏళ్ల అవని రికార్డు నెలకొల్పడంపై  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. 

చదవండి : Avani Lekhara: ఆనంద్‌ మహీంద్ర స్పెషల్‌ ఆఫర్‌

‘‘అద్భుతం..భారతీయ క్రీడలకు ఇది నిజంగా ప్రత్యే​ సందర్భం. షూటింగ్ పట్ల ఉన్న మక్కువ, నిబద్ధత, కఠోర శ్రమతోనే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలంటూ’’ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. మరోవైపు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్‌ రెహమాన్‌ అవనిని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. సోమవారం  టోక్యో పారా లింపిక్స్‌లో పతకాల వర్షం కురుస్తోంది. దీంతో పలువురు సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  10 మీటర్ల మహిళల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో బంగారు పతకం సాధించిన అవని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అవని గోల్ట్‌తో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య ఏడుకు చేరడం విశేషం. 

చదవండి: Tokyo Paralympics: స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా అవని రికార్డు 

మరిన్ని వార్తలు