Paralympics 2021: వినోద్‌ కూమార్‌కు కాంస్యం.. భారత్‌ ఖాతాలో మూడో పతకం

29 Aug, 2021 17:51 IST|Sakshi

Update: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో డిస్కస్‌ త్రో విభాగంలో వినోద్‌ కూమార్‌ కాంస్య పతకం సాధించాడు. దీంతో పారాలింపిక్స్‌లో ఒకేరోజు మూడు  పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి.

టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌ లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హై జంప్‌ T47 విభాగంలో నిషద్‌ కూమార్‌ రజత పతకం సాధించాడు. 24 మంది సభ్యుల అథ్లెటిక్స్ జట్టులో నిషిద్‌ కూమార్‌ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి  రెండో స్థానం లో నిలిచాడు. దీంతో నిషద్ కుమార్ రజతం కైవసం చేసుకున్నాడు.మరో వైపు ఆదివారం భవీనా బెన్‌ పటేల్‌ టేబుల్ టెన్నిస్ విభాగం మహిళల సింగిల్స్ క్లాస్ 4 పోటీల్లో రజత పతకం సాధించింది.

 పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ని  ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. పురుషల హై జంప్‌ టీ47 విభాగంలో నిషాద్‌ కుమార్‌ రజతం సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు.

చదవండిమరో టీమ్‌కు ధోని కెప్టెన్‌.. మిగతా 10 మంది వీళ్లే!

మరిన్ని వార్తలు