గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ : కోహ్లి

24 Mar, 2021 16:35 IST|Sakshi

పుణె : ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించిన తీరుని, ఈ విజయాన్నిఅందించడంలో కీలక పాత్ర పోషించిన శిఖర్‌ ధావన్‌ను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రత్యేకంగా కొనియాడాడు. 'ఇటీవల కాలంలో సాధించిన విజయాల్లో ఇది ఒక మధురమైన విజయంగా నిలిచిపోతుంది' అని కోహ్లి అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు.

 నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత జట్టుకు, రోహిత్ రూపంలో స్వల్ప స్కోరుకే  మొదటి వికెట్‌ను చేజార్చుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోహ్లి, శిఖర్ ధావన్ తో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ 105 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు గట్టి పునాది వేశారు. 'బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న దశలో పరగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్‌పై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ''ఇవాళ శిఖర్ ధావన్ ఆడిన తీరు, అతడు సాధించిన 98 పరుగులు స్కోర్ బోర్డులో చూపించే స్కోర్ కంటే విలువైనవి'' అని చెబుతూ ధావన్‌ని కోహ్లి అభినందనల్లో ముంచెత్తాడు. 

భారత ఓపెనర్ శిఖర్ ధావన్ పుణేలో మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 98 పరుగుల చేసి తను ఫామ్‌లోకి వచ్చినట్లు  ప్రకటించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్ మాన్ తన 18 వ వన్డే సెంచరీని కేవలం 2 పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. ( చదవండి : అరుదైన రికార్డు: సచిన్‌ తర్వాత కోహ్లినే ) 


 

మరిన్ని వార్తలు