Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్‌.. కెరీర్‌కు గుడ్‌బై

16 Jul, 2022 16:15 IST|Sakshi

అమెరికా లెజెండరీ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ అలిసన్‌ ఫెలిక్స్‌ పతకంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఓరెగాన్‌లోని హ్యూజిన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఫెలిక్స్ 4X400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో కాంస్య పతకం సాధించింది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో అలిసన్‌ ఫెలిక్స్‌కు ఇది 19వ పతకం కావడం విశేషం. 36 ఏళ్ల అలిసన్‌ ఫెలిక్స్‌ అమెరికా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ టీమ్‌లో ఎన్నో ఏళ్లుగా ముఖ్య క్రీడాకారిణిగా ఉంది.


తన కెరీర్‌లో ఫెలిక్స్‌ 19 వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పతకాలతో పాటు 13 ఒలింపిక్‌ పతకాలు గెలుచుకుంది. ఏడుసార్లు ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేతగా అలిసన్‌ ఫెలిక్స్‌ నిలవడం విశేషం. తాను రిటైర్‌ అయ్యే రోజున కచ్చితంగా మెడల్‌ అందుకుంటానని అలిసన్‌ ఫెలిక్స్‌ ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది.  తాజాగా వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పతకంతోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అలీసన్‌ తన మాటను నిలబెట్టుకుంది. 

చదవండి: Kick Boxing: నిర్లక్ష్యం.. రింగ్‌లోనే కుప్పకూలిన కిక్‌ బాక్సర్‌

Commonwealth Games 2022: బర్మింగ్‌హామ్‌లో వేర్వేరుగా వసతి!

మరిన్ని వార్తలు