రాహుల్‌ త్రిపాఠికి మందలింపు

19 Oct, 2020 18:02 IST|Sakshi

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠి ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో అతన్ని తీవ్రంగా మందలించారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో త్రిపాఠి నియమావళిని అతిక్రమించాడు. ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లో భాగంగా  లెవల్‌-1 నియమావళిలో 2.3 నిబంధనను ఉల్లంఘించాడు. అయితే త్రిపాఠి చేసిన తప్పిదం ఏమిటనే దానిపై స్పష్టత లేదు. నిన్నటి మ్యాచ్‌లో త్రిపాఠి ఓపెనర్‌గా వచ్చి 23 పరుగులు చేశాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో ఈ పరుగులు చేసి నటరాజన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.(ఆర్సీబీ వదులుకుంది.. ఢిల్లీ తీసుకుంది)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ రెండు పరుగులే చేసింది. తొలి మూడు బంతులకు రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. సూపర్‌ ఓవర్‌లో రెండు వికెట్లు పడితే అక్కడితో ఒక జట్టు ఇన్నింగ్స్‌కు తెరపడుతుంది. కేకేఆర్‌ పేసర్‌ ఫెర్గ్యూసన్‌ తొలి బంతికి వార్నర్‌ను ఔట్‌ చేయగా, రెండో బంతికి రెండు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి అబ్దుల్‌ సామద్‌ను బౌల్డ్‌ చేశాడు. 

దాంతో కేకేఆర్‌కు మూడు పరుగుల టార్గెట్‌ను మాత్రమే ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్దేశించింది.  కేకేఆర్‌ సూపర్‌ ఓవర్‌లో మోర్గాన్‌-కార్తీక్‌లు దిగి జట్టుకు విజయాన్ని అందించారు. రషీద్‌ ఖాన్‌ వేసిన ఆ సూపర్‌ ఓవర్‌ నాల్గో బంతికి లెగ్‌ బైస్‌ రూపంలో రెండు పరుగులు రావడంతో కేకేఆర్‌ విజయం సాధించింది. రషీద్‌ వేసిన రెండో బంతికి పరుగు రాగా, మూడో బంతికి పరుగు రాలేదు. నాల్గో బంతికి దినేశ్‌ కార్తీక్‌ లెగ్‌ బై రూపంలో రెండు పరుగులు తీయడంతో కేకేఆర్‌ విక్టరీ నమోదు చేసింది.

మరిన్ని వార్తలు