IPL 2023: కండల కాంతారావులా ధోని.. ఈ ఫిట్‌నెస్‌తో సిక్సర్లు కొడితే..!

16 Mar, 2023 13:29 IST|Sakshi

మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌ 2023 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారధి మహేంద్ర సింగ్‌ ధోని చాలా రోజుల నుంచి కఠోరంగా శ్రమిస్తున్నాడు. సీఎస్‌కేను ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్‌డి.. ఈ ఎడిషన్‌లో ఎలాగైనా టైటిల్‌ సాధించి, ఐపీఎల్‌ కెరీర్‌ను ఘనంగా ముగించాలని తపిస్తున్నాడు. ఈ క్రమంలో ధోని తన ఆటతీరుతో పాటు దేహాదారుడ్యాన్ని సైతం భారీగా మార్చుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక, కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితమైన ధోని, కొద్ది రోజుల కిందటి వరకు ఫిట్‌నెస్‌పై ఎలాంటి కాన్సన్ట్రేషన్‌ పెట్టక బొద్దుగా తయరయ్యాడు. అయితే ఈసారి తన జట్టుకు ఎలాగైనా ఐపీఎల్‌ టైటిల్‌ అందించాలని దృడసంకల్పంతో ఉన్న ధోని.. తన బాడీ వెయిట్‌ను భారీగా తగ్గించుకోవడంతో పాటు 100 పర్సెంట్‌ ఫిట్‌గా తయారయ్యాడు. ఫిట్‌నెస్‌ అంటే స్లిమ్‌గా, సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కాకుండా భారీగా కండలు పెంచి కండల కాంతారావును తలపిస్తున్నాడు.

పురులు తిరగిన ఈ కండలతో ప్రాక్టీస్‌ చేస్తున్న ధోని అవలీలగా భారీ సిక్సర్లు బాదుతున్నాడు. ఇది చూసి సీఎస్‌కే అభిమానలు తెగ సంబురపడిపోతున్నారు. ఓ పక్క రెజ్లర్‌ను తలపించే ధోని బాడీని చూడాలా లేక బరువెక్కిన కండలతో ధోని ఆడే మాన్‌స్టర్‌ షాట్లు చూడాలా అని తేల్చుకోలేకపోతున్నారు. ప్రాక్టీస్‌ సందర్భంగా పురులు తిరిగిన కండలతో ధోని భారీ షాట్‌ ఆడుతున్న ఓ దృశ్యం ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది.

ధోని బన్‌ గాయా రెజ్లర్‌ అంటూ అభిమానులు నెట్టింట తెగ హడావుడి చేస్తున్నారు. 41 ఏళ్ల వయసులో ధోని కుర్రాళ్లకు సవాలుగా మారాడంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండ్రోజుల కిందట ధోని ఆడిన ఓ భారీ షాట్‌కు సంబంధించిన వీడియోను ట్యాగ్‌ చేస్తూ ధనాధన్‌ ధోని ఈజ్‌ బ్యాక్‌ అని చర్చించుకుంటున్నారు.

కాగా, ధోని నేతృత్వంలోని సీఎస్‌కే మార్చి 31న 16వ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఢీకొట్టనున్న విషయం తెలిసిందే. గత కొన్ని సీజన్లుగా బ్యాటర్‌గా విఫలమవుతున్న ధోని చివరి సీజన్‌లోనైనా మెరుపులు మెరిపించాలని అభిమానులు ఆశిస్తున్నారు. గతేడాది దారుణమైన ప్రదర్శన కనబర్చి ఆఖరి నుంచి రెండో స్థానంలో నిలిచిన సీఎస్‌కే ఈ సీజన్‌లో ఎలాగైనా టైటిల్‌ సాధించాలని  అభిమానులు పరితపిస్తున్నారు. మరోవైపు ఈ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్‌ పగ్గాలు చేపడతాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. 

మరిన్ని వార్తలు